తిరుపతిలో నిర్బంధం : చంద్రబాబుకు మాత్రమే కోడ్, కోవిడ్ రూల్సా..?

రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబు నిరసన కొనసాగుతోంది. నాలుగు గంటల నుంచి ఆయన ఎయిర్‌పోర్టులోనే కింద కూర్చుని నిరసన తెలియచేస్తున్నారు. మంచినీళ్లు కూడా తాగలేదు. మధ్యాహ్న భోజనాన్ని తిరస్కరించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థులను బెదిరించడం, పోటీ చేయకుండా చేయడం.. నామినేషన్లు వేసిన వారి ఆస్తులను ధ్వంసం చేయడం వంటి వ్యవహారాలపై చిత్తూరులో నిరసన వ్యక్తం చేసేందుకు చంద్రబాబు వెళ్లారు. అయితే ఆయన చిత్తూరు ఎయిర్‌పోర్టులో దిగగానే పోలీసులు చుట్టుముట్టారు. వెళ్లడానికి పర్మిషన్ లేదని అడ్డు పడ్డారు. ఎందుకు లేదంటే… ఎన్నికల కోడ్ తో పాటు కోవిడ్ రూల్స్ ప్రకారం అంటూ నోటీసులు చేతిలో పెట్టారు. దీంతో చంద్రబాబు ఎయిర్‌పోర్టులోనే కింద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లగలిగే స్వేచ్చ ఉంది. ఏపీ పౌరుడిగా అది ఆయన హక్కు. కానీ.. అనుమతి తీసుకోలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు నిరనన తెలియచేయడానికి ఈసీ వద్ద పర్మిషన్ తీసుకున్నామని టీడీపీ వర్గాలు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. తమకు సమాచారం లేదని వాదించారు. చంద్రబాబు వద్దకే.. ఎస్పీ సహా పోలీసు ఉన్నతాధికారులు వచ్చి.. చర్చలు జరిపారు. వెనక్కి వెళ్లాలని కోరారు. అయితే చంద్రబాబు ససేమిరా అన్నారు. చిత్తూరుకు వెళ్లి … పార్టీ తరపున నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతానని ఆయన పట్టుబట్టారు.

చంద్రబాబును రేణిగుంట ఎయిర్‌పోర్టులో అడ్డుకోవడంపై టీడీపీ భగ్గుమంది. చంద్రబాబుకు రేణిగుంటలో ఇచ్చిన నోటీస్‌ చూస్తే పోలీసులు బుర్ర పెట్టి పనిచేస్తున్నారా లేదా అర్థం కావడం లేదని ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇతర టీడీపీ నేతలు ఇదేం పాలన అని విమర్శించారు. ఎమర్జెన్సీ కన్నా ఘోరంగా పరిస్థితి ఉందన్నారు. పలు చోట్ల టీడీపీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఘటనపై వైసీపీ నేత … అనధికారిక హోంమంత్రిగా పేరున్న సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అనంతపురం జిల్లాలో మంత్రి బొత్సతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో చంద్రబాబు చిత్తూరు ఎలా వెళ్తారని సజ్జల, బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు.

ఓ వైపు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాదయాత్రలు చేస్తున్నారు. క్రికెట్ కిట్లు బహిరంగంగా పంపిణీ చేస్తున్నారు. వీరెవరికీ ఎన్నికల కోడ్ కానీ. కోవిడ్ యాక్ట్ కానీ అమలు కావడం లేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పార్టీ పరమైన నిరనన వ్యక్తం చేయడానికి వెళ్తే పోలీసులు అటకాయించారు. ఏపీలో ఒక్క అధికార పార్టీ నేతలు మాత్రమే తిరగాలని.. వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలని.. ప్రచారం చేసుకోవాలన్నట్లుగా పోలీసుల తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో విశాఖలోనూ అదే తరహాలో చంద్రబాబును అడ్డుకున్నారు. అప్పట్లో పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశాలిచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కత్తి మహేష్ టెంప్లేట్ వైకాపా వదలదా? కత్తి స్థానాన్ని పోసాని భర్తీ చేయగలరా ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైఎస్ఆర్సిపి మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అంటూ చిన్న సైజు యుద్ధమే జరుగుతుంది. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా అమ్మాలి అన్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్...

పోసాని మళ్లీ రచ్చ – దాడికి ప్రయత్నించిన పవన్ ఫ్యాన్స్ !

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరోసారి మీడియా ముందుకు వచ్చిన పోసాని కృష్ణమురళి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం పెట్టి "పవన్ నీకెంత...

ప్రజల వరద కష్టాల కన్నా మీడియాకు సినిమా గొడవలే మిన్న !

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో తుపాన్ బీభత్సం సృష్టించింది. ఏపీలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికీ తేరుకోలేదు. కొన్ని వందల గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఇక నష్టపోయిన వారి గురించిచెప్పాల్సిన...

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

HOT NEWS

[X] Close
[X] Close