అమిత్ షా టూర్ కాన్సిల్..! తిరుపతిపై బీజేపీ అనాసక్తి..?

దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించి.. అమిత్ షా జల వివాదాలను పరిష్కరిస్తారని.. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సమావేశం అయితే ఖరారైంది. నాలుగు, ఐదు తేదీల్లో అమిత్ షా తిరుపతిలోనే ఉండాల్సి ఉంది. అయితే హఠాత్తుగా సమావేశానికి నాలుగు రోజుల ముందు అమిత్ షా టూర్ క్యాన్సిల్ అయిందని సమాచారం అందింది. కారణాలేమిటో స్పష్టత లేదు. అమిత్ షా రాకపోతే.. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరిగే చాన్స్ లేదు.

ముఖ్యమంత్రుల స్థాయి వారితో సమావేశం పెట్టాలంటే అది ప్రధాని మోడీ లేదా.. అమిత్ షానే అయి ఉండాలి. లేకపోతే హాజరయ్యేందుకు ముఖ్యమంత్రులు కూడా ఆసక్తి చూపించరు. అంటే సమావేశం జరగనట్లేదని భావించాల్సి ఉంటుంది. తిరుపతి ఉపఎన్నిక, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నేపధ్యంలో అమిత్ షా పర్యటనపై… బీజేపీ నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. షా వస్తారు.. సీన్ మార్చేస్తారని అనుకున్నారు. కానీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వాటి ఎన్నికల ప్రచారంపై అమిత్ షా ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లుగా చెబుతున్నారు.

బెంగాల్, అసోంలతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లోనూ ఎన్నికల ప్రచారసభల్లో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. తిరుపతిలో షా టూర్ రద్దు కావడంతో … అక్కడి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంలో కూడా బీజేపీ సైలెంట్ అయినట్లేననన్న చర్చ జరుగుతోంది. తిరుపతిలో ఖచ్చితంగా పోటీ చేసే ఉద్దేశం ఉంటే.. ఒక్క రోజు అయినా అమిత్ షా టూర్ పెట్టుకుని ఉండేవారని.. అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close