‘వైల్డ్ డాగ్’‌.. ఓటీటీ కోసం కాదు: నాగార్జున‌

నాగార్జున సినిమా `వైల్డ్ డాగ్‌` ఓటీటీలో విడుద‌ల అవుతుంద‌ని, నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని భారీ రేటు పెట్టి కొనుగోలు చేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై నాగార్జున స్పందించారు. వైల్డ్ డాగ్ ఓటీటీ కోసం తీసిన సినిమా కాద‌ని, దీన్ని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే.. న‌వంబ‌రు స‌మ‌యంలో ఈ సినిమాకి ఓటీటీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, తాము ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేయాల‌ని భావించామ‌ని, అయితే.. మారిన ప‌రిస్థితుల దృష్ట్యా, ఇప్పుడు థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపారు.

”న‌వంబ‌రులోనే సినిమా పూర్త‌య్యింది. అప్పుడు థియేట‌ర్ల‌న్నీ బంద్ అయ్యాయి. థియేట‌ర్లు తెర‌చుకుంటాయో లేదో తెలీదు, జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారో రారో తెలీదు. ఓటీటీ వాళ్లు మంచి ఆఫ‌ర్ ఇచ్చారు. అందుకే ఈ సినిమాని వాళ్ల‌కి ఇచ్చేశాం. సంక్రాంతి నుంచి ప‌రిస్థితి మారిపోయింది. క్రాక్‌, ఉప్పెన లాంటి సినిమాల‌కు జ‌నాద‌ర‌ణ బాగా ల‌భించింది. ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌న్న న‌మ్మ‌కం ఏర్ప‌డింది. అందుకే ఓటీటీ నుంచి ఈసినిమాని వెన‌క్కి తెచ్చుకున్నాం. ఇప్పుడు థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తున్నాం” అన్నారు. ఏప్రిల్ 2న ఈచిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు నిర్మాత నిరంజ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం హైద‌రాబాద్ లో జ‌రిగిన బాంబు పేళుళ్ల నేప‌థ్యంలో సాగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ పాచిక..! ఎవరీ ఆకుల వెంకటేష్..?

తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ ముందు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ... ఏకంగా అచ్చెన్నాయుడుపైనే స్టింగ్ ఆపరేష్ చేయడమే కాదు.. వైసీపీకి మద్దతుగా ప్రకటనలు చేస్తున్న ఆకుల వెంకటేష్ ఎవరన్నదానిపై ఇప్పుడు టీడీపీలో...

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

HOT NEWS

[X] Close
[X] Close