చ‌ర‌ణ్‌.. ‘సిద్ధ‌’మ‌య్యేదెప్పుడు?

చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో `ఆచార్య‌` రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ ఇందులో ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నాడు. ఆమ‌ధ్య టీజ‌ర్ కూడా విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌లో చిరు త‌ప్ప ఇంకెవ్వ‌రూ క‌నిపించ‌లేదు. సిద్ద‌గా.. చ‌ర‌ణ్ ఎంట్రీ ఎప్పుడ‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌, చ‌ర‌ణ్‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ కూడా దాదాపుగా పూర్తి కావొస్తోంది. ఈ సంద‌ర్భంగా `ఆచార్య‌` నుంచి సిద్ధ లుక్ బ‌య‌ట‌కు రాబోతోంది. ఈ మ‌హా శివ‌రాత్రికి చ‌ర‌ణ్ లుక్ ని విడుద‌ల చేసే ప‌నిలో ప‌డింది చిత్ర‌బృందం. ఇప్పుడు ప్రీ లుక్ కూడా విడుద‌ల చేసి ఊరిస్తోంది. శివ‌రాత్రికి చ‌ర‌ణ్ లుక్ మాత్ర‌మే ఉంటుందా? లేదంటే.. టీజ‌ర్ లాంటిది కూడా చూపిస్తారా? అనే మ‌రో కుతూహ‌లం కూడా తోడైంది. కొర‌టాల శివ అయితే.. చ‌ర‌ణ్ పాత్ర‌ని టీజ‌ర్ రూపంలో ప‌రిచ‌యం చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. మే 13న ఆచార్య విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. కాజ‌ల్‌, పూజా హెగ్డే క‌థానాయిక‌లు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close