ప‌వ‌న్‌, మ‌హేష్‌… మ‌ధ్య‌లో నాగ్!

2022 సంక్రాంతి బెర్తులు అప్పుడే ఖాయం అయిపోతున్నాయి. ఇప్ప‌టికే మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` ని సంక్రాంతికి విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. మ‌రోవైపు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ – క్రిష్ సినిమా కూడా పండక్కే వ‌స్తోంది. ఇప్పుడు నాగార్జున కూడా `నేను సైతం` అని ప్ర‌క‌టించేశారు. 2022 సంక్రాంతి పండ‌క్కి తాను కూడా వ‌స్తున్నాన‌ని జెండా ఎగ‌రేశారు.

నాగార్జున కెరీర్‌లో సూప‌ర్ హిట్ చిత్రం `సోగ్గాడే చిన్ని నాయిన‌`. 50 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసిన ఈ సినిమా సంక్రాంతికే వ‌చ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ ప్లాన్ చేశారు. అదే.. `బంగార్రాజు`. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. జూన్‌, జులైల‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుద‌ల చేస్తామ‌న్నారు నాగ్. ఈ రోజు హైద‌రాబాద్ లో `వైల్డ్ డాగ్` ప్ర‌మోష‌న్ ఈవెంట్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా `బంగార్రాజు` ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా బంగార్రాజు సంక్రాంతికి వ‌స్తాడ‌ని క్లారిటీ ఇచ్చేశారు నాగ్. అంటే… 2022 సంక్రాంతి సీజన్ కోసం ఇప్ప‌టికే మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయ‌న్న‌మాట‌. ఇంకెన్ని చేర‌తాయో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close