జనసేనతో మాకు ఎలాంటి పొత్తు లేదు: బీజేపీ నేత డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ తమ పార్టీకి జనసేనతో ఎటువంటి పొత్తు లేదని , ఉండబోదని వ్యాఖ్యానించడం ప్రస్తుతం సంచలనంగా మారింది వివరాల్లోకి వెళితే..

బీజేపీ నేత డీకే అరుణ ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతుండగా, బీజేపీకి టిఆర్ఎస్ కు లోపాయికారి ఒప్పందం ఉందా అన్న ప్రశ్న తనకు ఎదురయింది. ఇటీవల కెసిఆర్ ప్రధానిని కలిసిన తర్వాత కాంగ్రెస్ వైపు నుండి ఇటువంటి విమర్శలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీటిపై స్పందించిన డీకే అరుణ, టిఆర్ఎస్ తో తమకు ఎటువంటి పొత్తు లేదని, టిఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు ఆకర్షించబడకుండా టిఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ లో భాగంగా ఇటువంటి రూమర్స్ వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. టిఆర్ఎస్ తో తమకు ఏ స్థాయిలో ఎప్పుడూ పొత్తు లేదని ఆవిడ వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు 10 రోజుల పాటు అన్నం తినలేదని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్ పార్టీ తో బిజెపికి తెలంగాణలో పొత్తు ఉందా అని యాంకర్ ప్రశ్నించగా, దానికి డీకే అరుణ సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ కేవలం మోడీ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆకర్షితుడై జాతీయస్థాయిలో మోడీ ద్వారా పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రాంతీయ స్థాయిలో తమకు జనసేన తో ఎటువంటి సంబంధం లేదు అని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరఫునుండి జనసేనకు సీట్లు కేటాయిస్తారా అని యాంకర్ తిరిగి ప్రశ్నించగా, అసలు జనసేనతో తమకు పొత్తు లేనప్పుడు సీట్ల కేటాయింపు అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది అని ఆవిడ వ్యాఖ్యానించారు.

మొత్తానికి జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలనే ప్రస్తుతం డీకే అరుణ పునరుక్తి చేసినట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే రాబోయే తెలంగాణ ఉప ఎన్నికలలో బీజేపీతో పాటు జనసేన కూడా బరిలో ఉండే అవకాశం ఉంది. అలా జనసేన బరిలో నిలబడితే జనసేన అభ్యర్థి గెలవలేకపోయినప్పటికీ బీజేపీ అభ్యర్థి గెలుపు అవకాశాలకు గండి పడుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close