అప్పట్లానే ఈ సారి..! రాహుల్‌కు చంద్రబాబు చెప్పిన జోస్యం..!

రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ వర్గాలు ఓ రిపోర్ట్‌ను మీడియాకు లీక్ చేశాయి. అది… ఈ ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నదాని చంద్రబాబు అంచనా పేరుతో.. మీడియాకు ఇచ్చారు. దీని ప్రకారం.. మే 23వ తేదీన .. హంగ్ పార్లమెంట్ ఖాయమనేది… టీడీపీ అధినేత అంచనా. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమనేది… అంచనా.

మిత్రపక్షాలతోనూ బీజేపీకి అధికారం కల్ల..!

టీడీపీ అధినేత అంచనా ప్రకారం… భారతీయ జనతా పార్టీకి.. పార్లమెంట్ సీట్లు వంద వరకు తగ్గవచ్చు. ఒడిషా, బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ కొంత మేర పుంజుకున్నప్పటికీ.. హిందీ రాష్ట్రాల్లో …పలుకుబడి కోల్పోవడం .. గత ఎన్నికల్లో పూర్తి స్థాయిలో స్వీప్ చేసిన యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో..గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయడం సాధ్యం కానీ పరిస్థితి వల్ల.. బీజేపీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమన్న అంచనాను..చంద్రబాబు వేసినట్లు తెలుస్తోంది. యూపీలో ఎస్పీ బీఎస్పీ పొత్తు వల్ల బీజేపీ 42 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. అలాగే గత ఎన్నికల్లో స్వీప్ చేసిన గుజరాత్‌లో పది సీట్లు, మధ్యప్రదేశ్‌లో పన్నెండు సీట్లు, రాజస్థాన్ లో పది సీట్లు, గుజరాత్‌లో పది సీట్లు బీజేపీ కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో.. ఒడిషాలో గత ఎన్నికల్లో బీజేపీ ఒకటి గెలిస్తే.. ఈ సారి ఆరు, బెంగాల్‌లో గత ఎన్నికల్లో బీజేపీ రెండు గెలిస్తే.. ఈ సారి ఐదు చోట్ల గెలిచి సీట్లు పెంచుకోనుంది. కానీ.. కోల్పోయే సీట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. అందుకే.. మొత్తంగా..బీజేపీ వంద సీట్లు అటూఇటుగా కోల్పోయి 179 దగ్గరే నిలబడిపోవచ్చనేది..చంద్రబాబు అంచనా.

కాంగ్రెస్‌కూ కష్టమే..! మద్దతు పొందడమో.. మద్దతివ్వడమో చేయాలి..!

చంద్రబాబు అంచనా ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ కాస్తంత పుంజుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం అందుకునేంతగా.. బలపడలేదు. కనీసం అతి పెద్ద పార్టీగా అవతరించేంతగా కూడా.. బలపడలేదు. అయితే గత ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన కొన్ని రాష్ట్రాల్లో మాత్రం.. ఈ సారి ఉనికిని చాటుకుంటుంది. ఫలితంగా ఆ పార్టీ బీజేపీ కన్నా..దాదాపుగా యాభై సీట్లు వెనుకబడి.. 129 సీట్ల దగ్గర ఆగిపోవచ్చు. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా… ఇతర పార్టీలన్నీ 234 సీట్లు సాధించే అవకాశం ఉంది.ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, బీహార్, మహారాష్ట్ర,బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో స్థానిక పార్టీలే కీలకం కానున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీలకు అత్యధిక సీట్లు దక్కుతాయి. వీటిలో బీజేపీ వైపు చూసే పార్టీలు సాధించే సీట్లు 30 నుంచి 40 మాత్రమే. మిగతావన్నీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలే.

ఏపీలో వైసీపీకి ఎనిమిది ఎంపీ సీట్లు..!

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. బూత్‌ల వారీగా పరిశీలన జరిపిన.. టీడీపీ అధినేత .. ఏపీలో పరిస్థితిపై కూడా అంచనాకు వచ్చారు. గత ఎన్నికల్లోలానే ఈ సారి కూడా… ఏపీలో ఫలితాలొస్తాయని టీడీపీకి పదిహేడు ఎంపీ సీట్లు, వైసీపీకి ఎనిమిది రావొచ్చనేది టీడీపీ అధినేత అంచనా. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన రెండు ఎంపీ సీట్లతో కలిసి.. టీడీపీ కూటమికి పదిహేడు వచ్చాయి. ఈ సారి కూడా అదే రిపీట్ అవనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close