పవన్ తో బాబుకు కష్టమే

ఒక పద్దతి వుంటే వేరు. అది లేకపోతే వేరు. పవన్ కళ్యాణ్ వ్యవహారం తో చంద్రబాబుకు అంత వీజీగా వుండేలా లేదు వ్యవహారం. గత ఎన్నికల టైమ్ లో పవన్ నేరుగా పోటీ చేయలేదు. పైగా నేరుగా మద్దతు పలికారు. అందువల్ల సమస్య ఏమీ లేదు. కానీ ఈసారి ముందుగానే ఆయన ఎందుకో యాంటీ టీడీపీ స్టాండ్ చటుక్కున తీసేసుకున్నారు. దాని నుంచి మరి వెనక్కు వెళ్లలేకపోయారు. పోనీ అలా అని నేరుగా తెలుగుదేశం, వైకాపాలను ఢీ కొట్టే సాహసం పూర్తిగా చేయలేకపోయారు. దీనికి కారణం ధైర్యం లేక కాదు. ఓపిక లేక.

175 నియోజకవర్గాలు, కమిటీలు, బాధ్యులు, వారి నిర్వహణ, వారి కంట్రోలు వంటివి పవన్ వల్ల కాలేదు. ఇదిగో కమిటీలు అదిగో కమిటీలు అంటూనే సాగదీసుకుంటూ వచ్చారు. ఆఖరికి అలాంటివి ఏవీ లేకుండానే జనం ముందుకు ఎన్నికలకు వచ్చేసారు. నిజానికి ఇది చాలా తప్పుడు వ్యూహం. ఎంత చరిష్మా వున్నా, ఎంత ఇమేజ్ వున్నా, కింది స్థాయిలో కేడర్ ను ఆర్గనైజ్ చేయడం అన్నది చాలా అవసరం. పోల్ మేనేజ్ మెంట్ కు ఇది ఇంకా అవసరం.

పోనీ పవన్ కు సీట్లు వస్తే ఏమిటి పోతే ఏమిటి? అని అనుకుంటే, తెలుగుదేశం పార్టీకి ఇదే సమస్యగా మారుతోంది. అసలు పవన్ అనే వాడు ఎవరి ఓట్లు పట్టుకెళ్తాడు అన్న దాంట్లో క్లారిటీ లేదు. రాజకీయ వర్గాలు ఈ విషయంలో తల పట్టుకుంటున్నాయి. పవన్ పార్టీ పోటీ చేసే చోట్లు తెలుగుదేశం పరిస్థితి ఎలా వుంటుంది? వైకాపా పరిస్థితి ఎలా వుంటుంది అన్నది అంతు పట్టడం లేదు. కాపులకు దేశంపై కోపం వుంది అందువల్ల పవన్ కు పడే కాపు ఓట్లు దేశానివే అని అనుకుందాం. అప్పుడు కూడా ఆ ఓట్లు వైకాపాకు వెళ్లకపోవడం వల్ల దేశానికి ప్లస్ అవుతుందా? లేదా దేశానికి వెళ్లే ఓట్లు పవన్ కు వెళ్లి, వైకాపాకు ప్లస్ అవుతుందా అన్న ఈక్వేషన్ కు అంత సులువుగా సమాధానం దొరికేలా లేదు.

పోనీ ఓట్లు ఎలా పడతాయి..ఎవరి ఓట్లు పవన్ కొల్ల గొడతారు అన్న సంగతి తెలియడం లేదు అన్నది పక్కన పెడితే, అసలు పవన్ పోటీ సీరియస్ గానా? లోపాయకారీ ఒప్పదం వుందా? అన్నది కూడా అంతు పట్టడం లేదు. అనకాపల్లిలో మంత్రి గంటా బంధువుకు సీటు ఇచ్చారు పవన్. కానీ మళ్లీ అదే పవన్ భీమవరంలో గంటా వియ్యంకుడు మీద పోటీ చేస్తున్నారు. గాజువాకలో తెలుగుదేశం పార్టీకి కీలకమైన సీటులో పోటీ పడుతున్నారు. అక్కడ యాదవులపై కాపుల పోటీ అన్న కలర్ రావడం అన్నది మిగిలిన నియోజకవర్గాల్లో ప్రభావం చూపించే అవకాశం వుందని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

పవన్ వరకు బాగానే వున్నారు. కానీ పవన్ తో లోపాయకారీ ఒప్పందం వుందన్న ప్రచారం తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే ప్రమాదం వుంది. పవన్ విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త మెతకవైఖరి అవలంబిస్తోంది. ఇది కచ్చితంగా జనాల్లోకి రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. పవన్ చేసే తప్పులు తెలుగుదేశం ఖాతాకు ఇబ్బంది తెచ్చే ప్రమాదం వుంది.

పవన్ కు జగన్ కు చుక్కెదురు అన్నది క్లియర్ గా క్లారిటీగా జనంలోవుంది. కానీ పవన్ కు తెలుగుదేశానికి చుక్కెదురు అన్నది క్లారిటీగా జనంలోకి వెళ్లలేదు. ఎన్నికల అనంతరం పవన్ కు వచ్చే సీట్లు తెలుగుదేశానికే బలంగా వుంటాయన్న అభిప్రాయం జనంలో వుంది. అది వాస్తవం. ఇది ఇరు పార్టీల ఓటు బ్యాంకును ఏ మేరకు ఫ్రభావితం చేస్తుందన్నది అనుమానం.

ఇదిలా వుంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నికల ప్రచారం ప్రారంభించలేదు. ఆయన ప్రసంగాలు ఏ రీతిగా సాగుతాయన్నది చూడాలి. గతంలో మాదిరిగా కప్పదాటుగానే గోడ మీద కూర్చుని మాట్లాడుతారా? తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తారా? అన్నది చూడాల్సి వుంది. అప్పుడు దాని పర్యవసానాలు వేరుగా వుంటాయి.

ఇవన్నీ అలా వుంచితే రాయలసీమలో జనసేన బాగా కాన్సన్ ట్రేట్ చేయలేదు. వాస్తవానికి వైకాపా బలం రాయలసీమలో కాస్త ఎక్కువ. జనసేన ఓట్ బ్యాంక్ కూడా అక్కడ కాస్త వుంది. కానీ ఆ ప్రాంతాన్ని అలాగే వదిలేసారు. జేడీ లక్ష్మీనారాయణ స్వంత ఏరియా రాయలసీమ. ఆయనను అయినా అక్కడ పోటీకి నిలపాల్సింది. కానీ అలా చేయకుండా తీసుకెళ్లి ఉత్తరాంధ్రలో పెట్టారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి కాస్త ఇబ్బందికర పరిణామమే.

ఇలా ఒక తీరుగా కాదు, ఎన్నికల తరువాత ఎలా వుంటుందో కానీ, ముందు అయితే మాత్రం జనసేనతో బాబు పార్టీకి ఇబ్బందిగానే వుంది. నేరుగా విమర్శలు చేయడం లేదు. జగన్ ను విమర్శిస్తున్నారు. లోకేష్ మీద పోటీ పెట్టలేదు. ఇవి మాత్రమే పాజిటివ్ పాయింట్లు. మిగిలిన వ్యవహారం అంతా నెగిటివ్ నే. ఆ విషయం ఎన్నికల తరువాత స్పష్టం కావచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close