భీమ‌వ‌రం కోస‌మైనా త్రివిక్ర‌మ్ వ‌స్తాడా..?

ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్ర‌మ్ ల మ‌ధ్య ఉన్న బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రి మైత్రీ `జ‌ల్సా` నుంచీ కొన‌సాగుతూనే ఉంది. `అజ్ఞాత‌వాసి`లాంటి డిజాస్ట‌ర్ కూడా వీరిద్ద‌రి స్నేహానికి అడ్డు ప‌డ‌లేదు. ప‌వ‌న్ లాంటి వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి రావాల‌ని, ఆయ‌న అనుకున్న ఆశ‌యాన్ని అందుకోవాల‌ని ఆకాంక్షించిన వాళ్ల‌లో త్రివిక్ర‌మ్ ప్ర‌ధ‌ముడు.

ఇప్పుడు ప‌వ‌న్ భీమ‌వ‌రం, గాజువాక‌ల నుంచి పోటీ చేస్తున్నాడు. భీమ‌వ‌రం త్రివిక్ర‌మ్ పుట్టిన ఊరు. అక్క‌డ త్రివిక్ర‌మ్ అభిమానులు పెద్దసంఖ్య‌లో ఉన్నారు. ప‌వ‌న్ ప్ర‌చారంలో భాగంగా త్రివిక్ర‌మ్ కూడా వ‌స్తే బాగుంటుంద‌న్న‌ది భీమ‌వ‌రం వాసుల ఆశ‌. అయితే.. త్రివిక్ర‌మ్ ఎప్పుడూ రాజ‌కీయాల‌కు దూర‌మే. `నాక‌స‌లు రాజ‌కీయాలేం తెలీవు` అంటుంటాడు. అలాంటిది ఇప్పుడు మైకు ప‌ట్టుకుని మిత్రుడ్ని గెలిపించ‌మ‌ని ఎలా అడుగుతాడు..? త‌న సినిమా పనిలో తాను బిజీగా ఉన్నాడు. పైగా ప‌వ‌న్‌కి కూడా ఈ ఎన్నిక‌ల కూపంలోని త‌న మిత్రుల్ని గానీ, కుటుంబ స‌భ్యుల్ని గానీ దించాల‌ని లేదు. భీమ‌వ‌రం ప‌వ‌న్ సామాజిక వ‌ర్గానికి చాలా ప‌ట్టున్న ప్రాంతం. ఇక్క‌డ ప‌వ‌న్ ప్ర‌చారం చేయ‌క‌పోయినా గెలిచే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అలాంటి చోట‌.. ప్ర‌చారం కోసం త్రివిక్ర‌మ్ ని దించాల్సిన అవ‌స‌రం ఏముంది? ప‌వ‌న్‌కి త్రివిక్ర‌మ్ స‌హాయం ఏమైనా ఉంటే, ప‌రోక్షంగా ఉండొచ్చేమో. ప్ర‌త్య‌క్షంగా మాత్రం ఉండే అవ‌కాశాలు లేన‌ట్టే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close