ఈ ప్రశ్నకు సమాధానాన్ని చంద్రబాబు నుంచి రాబట్టిన జర్నలిస్ట్ ఒక్కడు కూడా లేడు. ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటికీ చంద్రబాబు దగ్గర చాలా రకాల సమాధానాలు ఉంటాయి. సందర్భానుసారం ఆ సమాధానాలు వస్తూ ఉంటాయి. తెలంగాణాలో ఉన్నప్పుడేమో టిడిపి లేఖ ఇవ్వబట్టే తెలంగాణా వచ్చింది అని అంటాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఉంటేనేమో విభజన పాపం కాంగ్రెస్, వైస్సార్ కాంగ్రెస్ పార్టీలది అని అంటాడు. తెలంగాణా విషయంలో రెండు నాలుకల గేం ఆడినవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ విషయం వదిలేద్దాం. కనీసం ‘బ్రీఫ్డ్ మీ’ అన్న వాయిస్ చంద్రబాబుదా? కాదా? అన్న ప్రశ్నకు సమాధానం కూడా చంద్రబాబు దగ్గర ఉండదు.
ప్రత్యేక హోదా వళ్ళ ప్రయోజనాలు ఏమీ లేవు అని తాజాగా మరోసారి కుండబద్ధలు కొట్టేశాడు చంద్రబాబు. ఇప్పుడు కూడా అదే సమస్య. చంద్రబాబు రెండు నాలుకల్లో దేన్ని నమ్మాలి అన్నదే ఆ సమస్య. 2014 ఎన్నికల సమయంలో ఐదేళ్ళ ప్రత్యేక హోదా అస్సలు సరిపోదు. పదేళ్ళు అన్నా కూడా కష్టమే. కనీసం పదిహేనేళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలి అని డిమాండ్ చేసింది చంద్రబాబే. నాకు అధికారం ఇస్తే పదిహేనేళ్ళ పాటు ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తానని ప్రగల్భాలు పలికిందీ చంద్రబాబే. ప్రత్యేక హోదా వళ్ళ ఎన్ని ప్రయోజనాలున్నాయి? ఎన్ని వేల పరిశ్రమలు వస్తాయి? ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి? అనే విషయాలన్నీ కూలంకుషంగా వివరించింది చంద్రబాబే. అనుకూల మీడియాలో పేజీలకు పేజీలు వండి వార్చిన కథలన్నీ ఇంకా నెట్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇప్పుడేమో ప్రత్యేక హోదాతో ఒక్క పరిశ్రమ కూడా రాదు, ఒక్క ఉద్యోగమూ రాదు అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు మీడియా కూడా మూడేళ్ళుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిన వ్యవహారమే. కాకపోతే శ్రీ చంద్రబాబునాయుడుగారిని మాత్రం ఒకే ఒక్క ప్రశ్న అడుగుదాం. ఓట్లు అడగడానికి మా దగ్గరకు వచ్చినప్పడు ప్రత్యేక హోదా గురించి ఒక నాలుకతో మాట్లాడారు. ఇప్పుడు అదే ప్రత్యేక హోదా గురించి రెండో నాలుకతో మాట్లాడుతున్నారు. రెండు నాలుకలతో మీరు మాట్లాడిన మాటల్లో ఏ మాటలను మేం నమ్మాలో చెప్పండి బాబయ్యా? కనీసం ఈ ప్రశ్నకు అన్నా ఒక నాలుకతో ఒకే సమాధానం చెప్పండి అని అడుగుదాం.
ప్రపంచానికి పాఠాలు చెప్పిన అత్యంత అనుభవజ్ఙడు, అవనీతి అంటే ఏంటో కూడా తెలియని నిప్పు నారా బాబుగారి నుంచి ఆ ప్రశ్నకు ఒకే సమాధానం ఆశించొచ్చంటారా?