ఏపీ రైస్ మాఫియాపై తమిళనాడు సీఎం గురి పెడతారా !?

తమిళనాడు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అక్కడి ప్రజలకు సరఫరా చేసే బియ్యాన్ని అక్రమంగా సేకరించి ఏపీలోని కుప్పం కేందరం రీ సైక్లింగ్, పాలిషింగ్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా పట్టుబడటం.. ఏపీ ప్రభుత్వం ఎలాంటి తీసుకోకపోతూండటంతో చంద్రబాబునాయుడు నేరుగా తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారు. తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందని .. వాటికి సంబంధించిన వివరాలను కూడా చంద్రబాబు స్టాలిన్‌కు పంపారు.

ఏయే రూట్లల్లో రేషన్‌ రైస్‌ మాఫియా అక్రమం గా రైస్‌ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు.. స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్‌కు రాసిన లేఖకు జత చేశారు. తమిళ పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల మీదుగా ఏపీకి తరలిస్తున్నారని.. తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తోందన్నాపు, ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా సరిగా లేకపోవడంతో రైస్ మాఫియా రెచ్చిపోతోందన్నారు.

అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఏపీలో రైస్ మిల్లర్లకు పంపుతున్నారని.. వారు పాలిష్ చేసి బహిరంగ మార్కెట్‌లో ప్రజలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి నిత్యావసర వస్తువుల చట్టం కింద కుప్పంలో దాదాపు 13 కేసులు నమోదయ్యాయని.. స్థానిక ప్రజలు సైతం చాలా మంది స్మగ్లర్లను పట్టుకుంటున్నా.. కేసులు నమోదు కావడం లేదన్నారు. పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతున్నందున సరిహద్దులలో నిఘా పెంెంచాలన్నారు. లేఖను ఏపీ సీఎస్‌కు కూడా పంపారు.

చంద్రబాబు లేఖపై ఏపీ సీఎస్ ఎలాంటి చర్యలు తీసుకునే చాన్స్ లేదు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా.. పేదలకు అందాల్సిన బియ్యాన్ని.. రూ. పది చొప్పున సేకరించి.. రీసైకిల్ చేసే మాఫియాపై ఏపీలో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close