టీడీపీ ఎంపీపై మండిపడ్డ బాబు: సంజాయిషీకి డిమాండ్

హైదరాబాద్: ఉచితంగా లభించే మద్యం, చికెన్‌వంటి సౌకర్యాలకోసమే అందరూ ఇండియన్ ఆర్మీలో చేరతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమలాపురం(ఎస్‌సీ) ఎంపీ, తెలుగుదేశం నాయకుడు పందుల రవీంద్రబాబుపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటికి తెలుగుదేశం పార్టీతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంబంధంలేదని బాబు ఇవాళ చెప్పారు. ఆ వ్యాఖ్యలకుగానూ 24గంటలలోగా సంజాయిషీ ఇవ్వాలని రవీంద్రబాబును ఆదేశించారు. జాతీయ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ లో అర్ణబ్ గోస్వామి డిబేట్‌లో రవీంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తూ, ఒక ఆర్మీ మేజర్ ఛానల్‌కు ఫోన్ చేసి ఎంపీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినప్పటికీ రవీంద్రబాబు తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని సమాధానం చెప్పటం విశేషం. సోషల్ మీడియాలో ఎంపీపై తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జంధ్యాల స్టైల్‌లో `పేక మేడ‌లు`

'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన వినోద్ కిష‌న్ ఇప్పుడు హీరోగా మారాడు. ఆయ‌న న‌టించిన 'పేక మేడ‌లు' ఈనెల 19న విడుద‌ల‌కు సిద్ధంగా...

బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభపక్షం విలీనం ?

బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి,...
video

విజ‌య్ తెలివి.. ‘పార్టీ’ సాంగ్‌లో పాలిటిక్స్

https://www.youtube.com/watch?v=ygq_g7ceook త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కొత్త‌గా పార్టీ స్థాపించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రాజ‌కీయ అరంగేట్రం చేయ‌బోతున్నాన‌ని, వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. రాజ‌కీయాల‌కు ముందు త‌న చివ‌రి...

పొన్నవోలు వాదన జగన్‌కైనా అర్థమవుతుందా ?

రఘురామ ఫిర్యాదుతో జగన్ తో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసు నమోదయింది. ఇది తప్పుడు కేసు అని వాదించడానికి పొన్నవోలు మీడియా సమావేశం పెట్టారు. ఇందు కోసం తన టేబుల్ నిండా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close