టి కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్ కారెక్కనున్న డీఎస్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గట్టి షాక్ తగిలింది. సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ డీఎస్ తెరాస సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేశవరావును కలిసి చర్చలు జరిపారు. ఇప్పటికే తెరాస సీనియర్ నేతలు హరీష్ రావు తదితరులతో ఆయన సంప్రదింపులు జరిపారని, ఆ పార్టీలో సముచిత గౌరవం లభిస్తుందని హామీ లభించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవటంతో డీఎస్ కొంతకాలంగా హైకమాండ్ మీద గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీ కార్యక్రమాలలోకూడా కొంతకాలంగా పాల్గొనటంలేదు.

కేకేతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన డీఎస్, టీఆరెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్నమాట నిజమేనని, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని డీఎస్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయసాయిరెడ్డి నీళ్లు నమిలిన ప్రశ్న..!

రఘురామకృష్ణంరాజుకు వేటు కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి బృందానికి .. లోక్‌సభ స్పీకర్ ఏం చెప్పారో .. ఏం హామీ ఇచ్చి పంపారో కానీ బయట మీడియా దగ్గర మాత్రం...

లద్దాఖ్‌లో సడన్‌ టూర్.. చైనాకు హెచ్చరికలు పంపిన మోడీ..!

భారత భాభాగాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ.. చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్న చైనా కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు. హఠాత్తుగా చైనా సరిహద్దుల్లో పర్యటించారు. అక్కడి సైనికులతో...

ఆర్ఆర్ఆర్‌పై ఎలా వేటేయాలో కూడా స్పీకర్‌కు చెప్పిన వైసీపీ బృందం..!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయాలని వైసీపీ నేతలు.. స్పీకర్ ఓంబిర్లాకు వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో వారు.. పలు కోర్టు తీర్పులను...

వ‌ర్మ టీమ్‌లో ‘క‌రోనా’ భ‌యం

లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ... సినిమాలు తీసే ధైర్యం చేశాడు రాంగోపాల్ వ‌ర్మ‌. అవి ఎలాంటి సినిమాలు? ఎవ‌రికి న‌చ్చాయి? అనేది ప‌క్క‌న పెడితే - క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లోనూ ప‌నైతే చేయ‌గ‌లిగాడు. వ‌ర్మ‌కి...

HOT NEWS

[X] Close
[X] Close