తెలకపల్లి రవి: ఇక్కడే చేయలేనిది, ఎక్కడో ఏం చేస్తారు?

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో బిజెపి వ్యతిరేక కూటమి పేరిట దేశమంతటా పర్యటిస్తున్నారు. నవంబరు 22న ఢిల్లీలో సమావేశం కూడా పెట్టానంటున్నారు. ఇంతవరకూ ఆయన కలిసిన నాయకులంతా బిజెపికి వ్యతిరేకంగా వున్నవారే. ఆ గట్టునుంచి ఈ గట్టుకు వచ్చిన వారెవరూ లేరు, వచ్చే సూచనలూ లేవు. డిసెంబర్‌ 11 ఎన్నికల ఫలితాల తర్వాతే దేశ రాజకీయ చిత్ర పటం నిజంగా అర్థమవుతుందని అనుకుంటున్నారు. అందుకే జాతీయ సమావేశం ఆ లోగానే ఏర్పాటు చేసుకున్నారు. రేపు తొలివిడతతో పోలింగ్‌ మొదలయ్యే చత్తీస్‌గడ్‌తో సహా ఎక్కడా బిజెపి వ్యతిరేక కూటమి కాంగ్రెస్‌ ఏర్పాటు చేయలేకపోయింది. యుపిలో బిజెపిని గట్టిగా వ్యతిరేకించే బిఎస్‌పి నేత మాయావతి కీలకమైన మూడు హిందీరాష్ట్రాలలోనూ విడిగానే పోటీ చేస్తున్నారు. చత్తీస్‌ఘర్‌లోనైతే ఆమె అజిత్‌ జోగి నాయకత్వంలోని కాంగ్రెసేతర కూటమితో చేరారు. సిపిఐ కూడా వారితోనే వున్నట్టు సమాచారం. మిజోరాం రాజకీయాలు వేరు గనక వదిలేస్తే మిగిలేది తెలంగాణ. ఇక్కడ టిడిప సిపిఐి చొరవతోనే మహాకూటమి మొదలైంది. టిజెఎస్‌కూడా చేరింది. తీరాచూస్తే నెల నుంచి కూటమి అంటున్నా ఇప్పటికీ సీట్ట పంపిణీ ఒక కొలిక్కి రాలేదు సరిగదా రచ్చ సాగుతూనే వుంది. ఈ లోగా చంద్రబాబుపై దాడి కేంద్రీకరించేందుకు టిఆర్‌ఎస్‌కు అవకాశం వచ్చింది తప్ప కూటమి ముందుకు సాగింది లేదు. ఏది ఏమైనా తాము కాంగ్రెస్‌తో వుంటామని టిడిపి నేతలు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు సహయ సహకారాలు అవసరం గనక వారు కూడా బాగానే స్పందిస్తున్నారు. అయితే మిగిలిన రెండు పార్టీలు ఘోరంగా పరాభవానికి గురైనా చంద్రబాబు జోక్యం చేసుకోలేకపోయారు.ఆయన మనిషిగా కాంగ్రెస్‌లో ప్రవేశించి ఇప్పటికీ హాట్‌లైన్‌ అనుబంధం కలిగివున్న రేవంత్‌ రెడ్డి లాటి వారి అసంతృప్తిని కూడా తీర్చలేకపోయారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి తాము చంద్రబాబు ఏదైనా చేస్తే సహించేది లేదన్నట్టు చెలరేగిపోయినా టిడిపి నుంచి కనీసం సమాధానం లేదు. అమరావతి వచ్చిన అశోక్‌గెల్హట్‌ కూడా మధ్య ప్రదేశ్‌ మాజీ ముఖ్మమంత్రిగా అసంతృప్త జీవిగానే వున్నారు. మరి గతంలో తాను పాలించిన ప్రాంతంతో ఏర్పడిన పక్క రాష్ట్రంలోనే పరిస్థితినిచక్కదిద్దలేనిది, ఎన్నికలు జరిగే చోట్ల ఎక్కడా ప్రభావం చూపలేనిది రేపు మాత్రం ఏం చేస్తారనేది విమర్శకుల ప్రశ్న. జాతీయ రాజకీయల్లో వచ్చిన బలాబలాల మార్పులూ, కాంగ్రెస్‌ బలహీనమైన తీరు అంచనా వేసుకోనందునే చంద్రబాబు అనవసరంగా ఆర్భాటం చేశారనే భావన ఆ పారీట వారిలో వుంది. తమ నాయకత్వం ఆయనతో కలవడం పొరబాటని పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డితో సహా అనుకుంటున్నారు. అందుకే అధిష్టానం మాటకు తలవంచుతామని మాత్రమే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close