మంత్రులుగా ఫరూక్, శ్రవణ్ ప్రమాణం..! గవర్నర్‌తో చంద్రబాబు చర్చలు..!!

ఏపీ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు బెర్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు భర్తీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, ఏ సభలోనూ సభ్యుడు కాని కిడారి శ్రవణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మంత్రి వర్గంలో… మైనార్టీ, ఎస్టీ వర్గాలకు ప్రాతినిధ్యం దక్కినట్లయింది. గవర్నర్ నరసింహన్ వీరితో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం తర్వాత మంత్రులందరితో గవర్నర్ గ్రూప్ ఫోటో దిగారు. ఇటీవలి రాజకీయ పరిణామాల కారణంగా.. ముఖ్యమంత్రి, గవర్నర్ ఎడమెహం, పెడమెహంగానే ఉన్నారు. అయితే ప్రమాణస్వీకారం అయిన తర్వాత సుమారు గంటపాటు చర్చలు జరిపారు. జగన్‌పై హత్యాయత్నం, సిట్‌ దర్యాప్తు, బీజేపీ నేతల తీరు, గవర్నర్ నేరుగా డీజీపీని నివేదిక కోరడం, కేంద్రం సహాయ నిరాకరణ, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాలు తదితర వాటిపై ఇరువురూ చర్చలు జరిపినట్లు సమాచారం.

మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించడానికి విజయవాడ వచ్చిన గవర్నర్‌ను.. బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు వచ్చి కలిశారు. ఆ భేటీలో… జీవీఎల్… కిడారి శ్రవణ్ తో ప్రమాణ స్వీకారం చేయించవద్దని కోరినట్లు ఒక్కసారిగా గుప్పుమంది. ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదని.. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో శ్రవణ్ ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశాలు లేవు కాబట్టి… ప్రమాణస్వీకారాన్ని నిలిపివేయాల్సిందిగా అభ్యర్థించినట్లుగా ప్రచారం జరిగింది. చట్టసభల్లో సభ్యుడు కాకుండానే ఆరు నెలలు మంత్రిగా ఉంటారని ఇది రాజ్యాంగ వ్యతిరేకమని.. గవర్నర్ వద్ద జీవీఎల్ వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. కానీ గవర్నర్ మాత్రం.. నిబంధనల ప్రకారం.. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన వ్యక్తితో ప్రమాణం చేయించడం తన విధి అని.. రాజ్యాంగం ప్రకారం.. ఆరు నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే.. పదవి పోతుందని… తన బాధ్యత తను నిర్వర్తిస్తానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత జీవీఎల్ నేరుగా విజయవాడ బీజేపీ ఆఫీసుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే శ్రవణ్ కు మంత్రి పదవి ఇచ్చిన విషయంలో మాత్రం ఎక్కడా బయటపడలేదు. ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వానికి నిబద్ధత లేదని విమర్శలు గుప్పించారు.

పదవుల పంపకం ద్వారా ఎవరూ నిరాశపడకుండా.. చంద్రబాబునాయుడు జాగ్రత్త వహించారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకులోయ మాజీఎమ్మెల్యే సివేరి సోమ పెద్ద కుమారుడు సివేరి అబ్రహంను రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమించారు. మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్సీ షరీఫ్ ను శాసనమండలి చైర్మన్ గా ప్రకటించారు. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు విప్ పదవి ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close