అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే అమరావతిలో రాజధాని.. !

అభివృద్ధి వికేంద్రీకణలో భాగంగానే అమరావతిని రాష్ట్రం మధ్యలో పెట్టామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాజధానిపై వైసీపీ నేతల ద్వంద్వ వైఖరిని మరోసారి మీడియా ముందు పెట్టారు. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పి మోసం చేశారని … రాజధానిని కాపాడుకోవడం అందరి బాధ్యతనిచ చంద్రబాబు గుర్తు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి ఏర్పాటు చేశామని..ఇతర ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టామో…చంద్రబాబు వివరించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీకి 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు విజయవాడలో రాజధాని ఉండాలని అభిప్రాయం చెప్పారన్నారు. 160 ప్రాజెక్టులను అన్ని జిల్లాలకు ప్రకటించామని 160 ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. అదే అభివృద్ధి వికేంద్రీకరణ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో అనేక ప్రాజెక్టులు వచ్చాయని … ఇప్పడు హైదరాబాద్‌ తెలంగాణకు ఆయువు పట్టుగా మారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దక్షిణ రాష్ట్రాల్లో తక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం ఏపీ ఒక్కటేననని.. ప్రభుత్వానికి ఆదాయం కల్పించే ప్రాజెక్టు అమరావతి అని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతిని ధ్వంసం చేస్తే ఆదాయం ఎలా వస్తుందనిప్రశఅనించారు. విశాఖలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ..గంగవరం పోర్టును తానే తీసుకొచ్చానని …విశాఖ ఇప్పటికే ఫార్మా రాజధానిగా ఉందన్నారు. టూరిజం హబ్‌గా తీర్చిదిద్దామన్నారు.

వైసీపీ నాయకులకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టి భజన చేయడం తప్ప.. అభివృద్ధి చేయడం రాదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నా స్వార్థం కోసం కాదు.. ప్రజల కోసమన్నారు. నన్ను ఏం చేయలేక.. తనపై కులుం ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి మనందరి బాధ్యత అని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని … ఇప్పుడు పోరాడకపోతే.. మనం తీవ్రంగా నష్టపోతామని ప్రజలకు పిలుపునిచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

HOT NEWS

[X] Close
[X] Close