జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ సన్ మళ్లీ అరెస్ట్..!

గురువారం సాయంత్రమే కడప జిల్లా జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. పాత కేసులేవీ అరెస్ట్ చేయడానికి లేకపోవడంతో… సీఐ దేవంద్రకుమార్ తో ఫిర్యాదు చేయించి మరీ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. బెయిల్ షరతుల్లో భాగంగా… పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టేందుకు వెళ్లిన వారిని పోలీసులు ఉదయం నుంచి నిర్బంధించారు. సాయంత్రం అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్, నకిలీ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో జిల్లా కోర్టు బెయిలివ్వడంతో…వారు గురువారం సాయంత్రం విడుదలయ్యారు.

ఆ సందర్భంగా స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున అనుచరులు కడప జిల్లా జైలు వద్దకు వచ్చారు. అక్కడే వారిపై లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత ర్యాలీగా తాడిపత్రికి వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కారును సీఐ దేవంద్రకుమార్ అడ్డుకున్నారు. ఆ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటికి క్లియరెన్స్ ఇచ్చి పంపేశారు పోలీసులు . ఆ సమయంలో… తమపై ఎన్ని కేసులు పెట్టినా…తాము టీడీపీలోనే ఉంటామనే ప్రకటనలు చేశారు. అనంతపురం పోలీస్ స్టేషన్ కు సంతకం పెట్టేందుకు వెళ్లే ముందు మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. అమరావతిని కొనసాగిస్తే.. వైసీపీలో చేరుతామని ప్రకటించారు.

ఆ తర్వాత అనంతపురం వెళ్లే సరికి..అరెస్ట్ కు ప్రణాళిక సిద్ధమైపోయింది. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు.. పోలీస్ స్టేషన్ కు రాగానే..ఇటు తాడిపత్రిలో పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. పోలీసులతో రాజకీయనాయకుల వాగ్వాదాలు సహజంగానే జరుగుతూ ఉంటాయి. అయితే పోలీసులు కేసులు పెట్టే సందర్భాలు ఉండవు. కానీ ఇక్కడ మాత్రం..సీఐ… నేరుగా ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టేశారు. పోలీసులు అరెస్ట్ చేసేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకీ ఈవీఎం ఎన్నికలే కావాలట..!

భారతీయ జనతాపార్టీ ఈవీఎంలతో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. కరోనా కాలంలో ఒకే ఈవిఎం బటన్‌ను అందరూ అదే పనిగా నొక్కితే కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుందని ఆందోళనలు వినిపిస్తున్న సమయంలో......

టీడీపీ నుంచి పురందేశ్వరికి సపోర్ట్..!

భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవి పొందిన ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి ప్రశంసలు కన్నా ఏపీలో ఎక్కువగా విమర్శలే వస్తున్నాయి. సొంత పార్టీకి చెందిన నేతలు పెద్దగా అభినందించినట్లుగా కనిపించలేదు కానీ...

పారితోషికాల త‌గ్గింపు.. పెద్ద జోక్‌

ఇండ్ర‌స్ట్రీలో ఎప్పుడూ ఓ మాట వినిపిస్తుంటుంది. ''బ‌డా స్టార్లు పారితోషికాలు త‌గ్గించుకోవాలి..'' అని. త‌రాలు మారినా, ప‌రిస్థితులు మారినా.. ఈ మాట మాత్రం మార‌లేదు. హీరోలు పారితోషికాలు త‌గ్గించుకోలేదు.. నిర్మాత‌లు త‌గ్గించి ఇచ్చిన...

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

HOT NEWS

[X] Close
[X] Close