రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను జగన్ వాడుకుంటున్నారన్న చంద్రబాబు..!

టెండర్ల విషయంలో న్యాయవ్యవస్థ ప్రమేయం లేకుండా.. ఆ వ్యవస్థను భాగం చేస్తూ.. ఏపీ సర్కార్ ఓ బిల్లును సిద్ధం చేసింది. దానికి కేబినెట్‌లోనూ ఆమోదం తెలిపింది. జ్యూడిషియల్ కమిషన్‌లో హైకోర్టు జడ్జి ఉంటారని.. ఇప్పటి వరకూ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ సారి.. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోనూ సమావేశమయ్యారు. అప్పుడు దీనిపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత న్యాయవ్యవస్థ నుంచి దీనిపై ఎలాంటి కమ్యూనికేషన్ జరిగినట్లు ప్రభుత్వం చెప్పలేదు. కానీ.. బిల్లును మాత్రం రూపొందించేశారు.

పరిపాలన.. టెండర్ల ఖరారు వంటి అంశాల్లో న్యాయవ్యవస్థ జోక్యమే చేసుకోదని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రతి వ్యవస్థకు కొన్ని విధులు, పరిమితులు ఉంటాయని.. వాటి వరకే వ్యవహరిస్తారని… గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. మీడియా ముందు స్పష్టం చేశారు. జగన్ చెబుతున్న జ్యూడిషియల్ కమిషన్ సాధ్యం కాదని… ఆయన అవాస్తవాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాజకీయాల కోసం.. న్యాయవ్యవస్థను జగన్ వాడుకుంటున్నారని… చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే… జ్యూడిషియల్ బిల్లుకు.. ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. అయితే.. ఇందులో.. హైకోర్టు జడ్జి లేదా.. రిటైర్డ్ జడ్జి అని పెట్టడంతోనే.. నిపుణుల వాదన కరెక్టేనని.. రాజకీయ పార్టీల్లోనూ చర్చ ప్రారంభమైంది.

టెండర్ల కోసం ఉద్దేశించిన జ్యూడిషియల్ కమిటిలో ఉండేందుకు హైకోర్టు న్యాయమూర్తికి నిబంధనలు అంగీకరించవు. అది సాధ్యం కాదు. ఏపీ సర్కార్ చట్టం చేసినా.. అది వారికి వర్తించదు. ఆ విషయం.. జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టే… హైకోర్టు జడ్జి లేదా రిటైల్డ్ జడ్జి అనే ప్రస్తావన పెట్టారంటున్నారు. నేరుగా హైకోర్టు జడ్జి నేతృత్వం వహిస్తే.. అది జ్యూడిషియల్ కమిషన్ అవుతుంది కానీ… రిటైర్డ్ జడ్జి నాయకత్వం వహిస్తే.. అది జ్యూడిషియల్ కమిషన్‌ అయ్యే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు. జడ్జిలు ఇలాంటి పనుల్లో పాలు పంచుకోరని.. అందుకే వెసులుబాటు కోసమే రిటైర్డ్ జడ్జి పేరును తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. దీంతో… రాజకీయాల కోసం.. జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థను వాడుకుంటున్నారనే అభిప్రాయం బలపడుతోందని టీడీపీ నేతలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ సలహాదారులు కి కనీస అవగాహన లేదా ?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యలో ప్రతిపక్షపార్టీల నేతలు..జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఆర్డినెన్స్ ఇచ్చి... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. పదవిలో ఉండే అర్హత...

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు తీపి కబురు: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు...

బాల‌య్య ఇష్యూ: కేసీఆర్‌పై నెట్టేశారుగా!

`ఇండ్ర‌స్ట్రీ స‌మావేశాల‌కు న‌న్ను పిల‌వ‌లేదు` అన్న బాల‌య్య మాట - ప‌రిశ్ర‌మ‌లో కొత్త వివాదానికీ, కాంపౌండ్ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. బాల‌య్య‌ని పిల‌వ‌క‌పోవ‌డం త‌ప్పే అని ప‌రిశ్ర‌మ‌లో చాలామంది పెద్ద‌లు తేల్చేస్తున్నారు....

ద‌ర్శ‌కేంద్రుడి ‘కాన్సెప్ట్’ ఏమిటి?

న‌మోః వేంక‌టేశాయ త‌ర‌వాత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌లేదు ద‌ర్శ‌కేంద్రుడు. ఆయ‌న సినిమాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. ద‌ర్శ‌కేంద్రుడు రిటైర్ అయిపోయార‌ని, ఆయ‌న ఇక సినిమాలు చేయ‌ర‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఓ మంచి సినిమా...

HOT NEWS

[X] Close
[X] Close