స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు..! సాధ్యాసాధ్యాలు పరిశీలించారా..?

ఏ పరిశ్రమలో అయినా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం చేయడానికి ఏపీ సర్కార్ రెడీ అయిపోయింది. బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే చట్టం అవుతుంది. అంటే..ఏపీలో ఇక ఎక్కడ.. ఎవరు పరిశ్రమ పెట్టినా… 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. యువతకు ఇది సువర్ణావకాశం. తమ ఊరిలో లేదా.. తమ జిల్లాలో పెట్టే పరిశ్రమలో… ఉద్యోగాలన్నీ.. 75 శాతం అక్కడి వారికే ఇస్తే… వలస వెళ్లాల్సిన పని ఉండదు. కానీ అసలు పరిశ్రమలే రాకపోతే.. ఉద్యోగాలెక్కడి నుంచి వస్తాయన్న వాదన తెరపైకి వస్తోంది. ఈ నిబంధన వల్ల అసలు పరిశ్రమలే రావన్న వాదన కూడా వినిపిస్తోంది.

నైపుణ్యం ఉన్న కార్మికులు ఎక్కడ దొరుకుతారు..?

ఏదైనా ఓ కంపెనీ.. ఫలానా ప్రాంతంలో తమ పరిశ్రమ పెట్టాలి అనుకుంటే.. అంచనా వేసుకునే మొట్టమొదటి అంశం.. మ్యాన్ పవర్ దొరుకుతుందా..? అనేది. ఉత్పాదక పరిశ్రమలకు నైపుణ్యం ఉన్న కార్మికులు చాలా అవసరం. అలాంటి వారు దొరుకుతారు అనుకుంటేనే పరిశ్రమ ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తాయి. కియా పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యం ఉన్న కార్మికులు.. అనంతపురంలో దొరికే పరిస్థితి లేదు. అందుకే.. దొరికినంత మందిని అప్పటికి చాలా మందికి శిక్షణ ఇచ్చి స్కిల్డ్ లేబర్‌ని అనంతపురం జిల్లా నుంచి తీసుకున్నారు. మిగిలిన వారిని… పంజాబ్ సహా.. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నారు. అంటే.. 75 శాతం స్థానికత నిబంధన ఉంటే… కియా వచ్చేది కాదు. వారు ఉన్నచోటకే వెళ్లిపోయేదంటున్నారు.

ప్రత్యేక ఆర్థిక మండళ్ల గురించి ప్రభుత్వానికి తెలియదా..?

ఇప్పుడు ఏర్పాటయ్యే ప్రతి పరిశ్రమ దాదాపుగా.. సెజ్‌లోనే ఏర్పాటవుతోంది. చాలా పరిమితంగా మాత్రమే బయట పరిశ్రమలు స్థాపిస్తున్నారు. ఒకే వేళ ఏదైనా కంపెనీ భారీ స్థాయిలో పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే.. ముందుగా.. సెజ్ హోదా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఏపీలో ఇప్పుడు శ్రీ సిటీ సహా.. పదుల సంఖ్యలో సెజ్‌లు.. వివిధ జిల్లాల్లో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఉన్నాయి. వాటిల్లోనే కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి. రాబోతున్నాయి కూడా. అయితే.. వీటిలోనూ… 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే నిబంధన ఏపీ సర్కార్ పెడితేనే.. అసలు ఉద్దేశం నెరవేరుతుంది. కానీ సెజ్‌లలో ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేయలేరని.. నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే… సెజ్ అంటేనే… నిర్దేశిత ప్రాంతంలో ఎలాంటి నియమ, నిబంధనలు, లెసైన్సులు లేకుండా వివిధ ఉత్పాదక, వాణిజ్య, సేవా సంస్థలను ఏర్పాటు చేయడం. వీటిలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి ఏపీ సర్కార్ ఆదేశించలేదు.

స్థానికత పేరుతో యువతలో అలజడి..!

అసలు స్థానికతను ఎలా నిర్ణయిస్తారన్నది ఆసక్తికరం. పరిశ్రమ వచ్చిన గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటారా… ? మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారా..? అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంటారా..? పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకుంటారా.. లేక జిల్లాను తీసుకుటారా..? అనేది.. సహజంగా యువతలో వచ్చే సందేహం. తమ గ్రామంలో… తమ భూముల్ని త్యాగం చేశాం కాబట్టి.. 75 శాతం తమకే ఇవ్వాలని గ్రామస్థాయిలో డిమాండ్లు రావొచ్చు.. ఇలాంటి డిమాండ్లు జిల్లా వరకూ వస్తాయి. అలా కాదు.. ప్రభుత్వం నిర్ణయించిన జోన్ల ప్రకారం.. స్థానికత ఇస్తామంటే.. అది మూడు నాలుగు జిల్లాలకు వర్తిస్తుంది. అప్పుడు మరింత సమస్యాత్మకంగా పరిస్థితి మారుతుంది. ఎక్కువ జిల్లాలకు వర్తింప చేస్తే.. తమకు అన్యాయం జరుగుతుందనే భావన.. ఫ్యాక్టరీ ఉన్న గ్రామం నుంచే ప్రారంభమవుతుంది.. ఇలాంటి భావనే పునాదిగా.. స్థానికులకు ఉద్యోగాలు అనే నిర్ణయం తీసుకుంటున్నారు.

అధికారుల మాటలు సీఎం ఎందుకు లెక్క పెట్టరు..!?

ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టే.. కేబినెట్ భేటీలో అధికారులు జగన్మోహన్ రెడ్డికి సలహాలిచ్చే ప్రయత్నం చేశారు. వేరే మార్గాల ద్వారా… జగన్ హామీని నెరవేర్చే అవకాశాలున్నాయని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. వారి సలహాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. తాను చెప్పినట్లు చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. అదే బిల్లుగా తెస్తున్నారు. తర్వాత పరిణామాలు ఏపీనే ఎదుర్కోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close