చంద్రబాబు ఎగ్జిట్‌ పోల్‌లో టీడీపీకి 110 సీట్లు..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. జాతీయ మీడియా చానళ్లు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చారు. ఎగ్జిట్ పోల్స్ గందరగోళానికి గురి చేస్తాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ముందు నుంచీ టీడీపీ అధినేత చెప్పుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు.. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా అదే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ విజయం 110 సీట్ల నుంచి ప్రారంభమవుతుందని.. అది 130 సీట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పార్లమెంట్ సీట్లు 18 నుంచి ఇరవై ఖాయమంటున్నారు. విశేషం ఏమిటంటే.. లగడపాటి సర్వే కంటే.. ఎక్కువే టీడీపీకి వస్తాయంటున్నారు.

మరోవైపు.. లగడపాటి సర్వేలో.. టీడీపీ 90 నుంచి 110 సీట్లు వరకు వస్తాయని చెప్పినప్పటికీ.. టీడీపీ నేతలు… అంగీకరించడం లేదు. అంత కంటే ఎక్కువే వస్తాయని… టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి.. తొడకొట్టి మరీ చెప్పారు. వైసీపీ ఓడిపోతుందని.. జగన్‌కు కూడా తెలుసని ఆయన చెబుతున్నారు. చాలా మంది టీడీపీ నేతల్లో… గెలుపుపై ధీమా ఉంది. ఎందుకంటే.. 2014లో … వైసీపీ గెలుస్తుందని.. ఏ సర్వేలు చెప్పాయో.. అవే సర్వేలు ఇప్పుడు కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. 2014లో టీడీపీ గెలుస్తుదని.. చెప్పిన సర్వేలే.. ఇప్పుడు టీడీపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ముఖ్యంగా లగడపాటి రాజగోపాల్ కూడా.. టీడీపీ వైపే సర్వే ప్రకటించారు. 2014లోనూ ఆయన సర్వే ప్రకటించినప్పుడు.. అందరూ విమర్శలు చేశారు. కానీ ఆయన సర్వే నిజమయింది. ఇప్పుడు కూడా అలాగే విమర్శలు చేస్తున్నారని.. లగడపాటి సర్వేను నమ్ముతామని టీడీపీ నేతలు అంటున్నారు.

వైసీపీ నేతల్లోనే టెన్షన్ ప్రారంభమయింది. తెలంగాణలో మహాకూటమి గెలుస్తుందనే మౌత్ టాక్ విపరీతంగా వచ్చింది. కానీ.. ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. ఇప్పుడు.. ఏపీలో వైసీపీ గెలుస్తుందనే మౌత్ టాక్.. అంతే స్ప్రెడ్ అయింది. మరి ఫలితాలు ఎలా వస్తాయోనని… వారు ఆందోళనకు గురవుతున్నారు. నిజానికి జాతీయ మీడియా సర్వేల పేరుతో వారు ధైర్యం తెచ్చుకుంటున్నారు కానీ.. నంద్యాల సహా.. అనేక అనుభవాల రీత్యా… వారిలోనూ ఆందోళన ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close