చివరి బాల్ వరకూ ఆడాలనుకుంటున్న చంద్రబాబు..!

చివరి బాల్‌ వరకూ విజయం కోసం ప్రయత్నించేవారే నిజమైన ఆటగాడు..! విజయమో.. వీర స్వర్గమో.. తేల్చుకోవడానికి.. మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడ్డాయని.. ఇక ఓడిపోయినట్లేనని… వదిలేసి వెళ్లిపోయేవాడు.. ఎప్పటికీ .. గెలవడు. అది తెలిసిందే. చంద్రబాబు ఇప్పుడు.. మోడీని గద్దె దింపడానికి.. చివరి బాల్ వరకూ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో.. ఆయనకు ఎదురు దెబ్బలు తగులుతున్నా… ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం.. ఈ మూల నుంచి ఆ మూలకు.. ఆ మూల నుంచి ఈ మూలకు తిరుగుతూనే ఉన్నారు.

మోడీ మళ్లీ ప్రధాని కాకూడదనేదే చంద్రబాబు లక్ష్యం..!

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయానికి.. అది చేసిన మోడీకి కచ్చితంగా… షాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో చంద్రబాబు.. గత ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కరి వల్ల సాధ్యం కాదు కాబట్టి… మిత్రపక్షాలన్నింటినీ ఏకం చేయాలనుకున్నారు. దాని ప్రకారం.. చాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పట్ల ఢిల్లీ స్థాయిలో పార్టీలు సానుకూలత ప్రకటించినప్పటికీ… రాష్ట్రాల్లో మాత్రం విడివిడిగా పోటీ చేశాయి. అలా చేయడం వల్ల… ఓట్లు చీలిపోయి.. బీజేపీకి లాభం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ కలసి పోటీ చేస్తే.. ఇద్దరికీ లాభమని.. చంద్రబాబు ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా… వారు తగ్గలేదు. దాంతో.. బీజేపీకి ఎడ్జ్ వచ్చిందని చెబుతున్నారు. ఇలాంటి ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా చంద్రబాబు వెనక్కి తగ్గడం లేదు.

చంద్రబాబు ప్రయత్నాలపై ఎలాంటి ప్రభావం చూపని ఎగ్జిట్ పోల్స్..!

ఇక .. ఎస్పీ, బీఎస్పీ కూటమిని.. కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేందుకు.. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాము కాంగ్రెస్‌తో సన్నిహితంగా మెలిగితే.. యూపీలో తమ పార్టీలకు ముప్పు వస్తుందేమోనని వారు వెనుకడుగు వేశారు. అదే సమయంలో వారు బీజేపీకి మేలు చేస్తున్నామన్న సంగతిని మర్చిపోయారు. ఫలితాల తర్వాత వారు కాంగ్రెస్ వైపు వస్తారని ఊహించినప్పటికీ… ఈ లోపు ఎగ్జిట్ పోల్స్ రావడంతో… వారు కూడా ఆందోళనకు గురయ్యారు. మమతా బెనర్జీ కూడా… ప్రధానమంత్రి పదవిపై ఆశతో.. కూటమికి దూరంగా ఉన్నారు. అందర్నీ పదే పదే బుజ్జగించే ప్రయత్నంలో చంద్రబాబు ఎక్కడా అలసి పోవడం లేదు.

చివరి క్షణం వరకూ చంద్రబాబు ప్రయత్నాలు..!

ఎగ్జిట్ పోల్స్ తర్వాత చంద్రబాబు ప్రయత్నాన్ని చాలా మంది చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ… ఎన్డీఏకు పూర్తి స్థాయి మెజార్టీ రాదని భావిస్తున్న ఆయన… తన ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఫలితాలు వచ్చే వరకూ ప్రాంతీయ పార్టీలను కలిపి ఉంచాలనే లక్ష్యంతో పయనిస్తున్నారు. మరోసారి.. అన్ని పార్టీల నేతలను కలిసి.. ఉమ్మడిగా.. వీవీ ప్యాట్లు లెక్కింపుపై ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు ప్రయత్నాలు చూసి.. చివరి బాల్ వరకూ ఆడేవారికి.. నిజమైన స్పిరిట్ ఉన్నట్లుగా… అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. చివరి క్షణం వరకూ.. మోదీని గద్దె దించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయనకు విజయం లభిస్తుందో… లేదో చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి అమ్మకం ఆస్తుల లిస్ట్ చాలా పెద్దదే..!?

తమిళనాడులో నిరర్థకంగా ఉన్న ఆస్తులను అమ్ముతున్నామని వాటిని అమ్మేస్తే.. రూ. కోటిన్నర కూడా రాదంటూ... అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. మరి కోటిన్నర కోసమే ఇన్ని విమర్శలను ఎందుకు ఎదుర్కొంటున్నారు.. దేవుడి ఆస్తుల్ని...

ప్రజల భాగస్వామ్యంతో.. “మన పాలన – మీ సూచన..!”

అధికారం చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా.. ఏపీ సర్కార్ పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనుకుంది. దాని ప్రకారం ఐదు రోజుల పాటు మేథోమథనం నిర్వహిస్తోంది. ప్రజల ఆలోచనలు, సూచనలను నిరంతరం పరిగణనలోకి తీసుకుంటూ...

నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కున్నా

చిత్ర‌రంగంలో లైంగిక వేధింపులు స‌ర్వ‌సాధార‌ణ విష‌యంగా మ‌రిపోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ... ఈ విష‌యంలో నోరు మెద‌ప‌లేదు. `చెబితే అవ‌మానం` అని భ‌య‌ప‌డ్డారు. కానీ ఆ భ‌యాల్ని వ‌దిలి.. బ‌య‌ట‌కు వ‌స్తున్నారు...

ఇక పూరి.. ద‌బాంగ్‌!

బాలీవుడ్‌లో ఓ సినిమా చేయ‌డానికి పూరి జ‌గ‌న్నాథ్ గ‌ట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న‌ట్టు పూరి ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు. అందులో ఓ అగ్ర క‌థానాయ‌కుడు...

HOT NEWS

[X] Close
[X] Close