ఇంటి గేట్లకు తాళ్లు..! వెనక్కి తగ్గేది లేదంటున్న చంద్రబాబు..!

పోలీసులు ఎప్పుడు వెళ్లనిస్తే అప్పుడే ఆత్మకూరు వెళ్తానని.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి బయలుదేరిన ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు బయటకు రాకుండా.. ఆయనను.. ఇతర నేతలు కలవకుండా… గేట్లకు పెద్ద .. పెద్ద తాళ్లతో కట్టి వేశారు. కరకట్టపై వందల మంది పోలీసుల్ని మోహరించారు. దాంతో.. ఇంటిలోపుల కొంది మంది నేతలు ఉండిపోయారు. వెలుపల అనేక మంది నేతలు ఉండిపోయారు. పోలీసుల నిర్బంధంపై తీవ్రంగా విరుచుకుపడిన చంద్రబాబు.. ఎంత కాలం.. నిర్బంధిస్తారో తానూ చూస్తానని సవాల్ చేశారు. పోలీసులు ఎప్పుడు వదిలి పెడితే.. అప్పుడే… ఇవాళ అయితే.. రేపు అయితే రేపు… లేకపోతే ఎల్లుండి.. ఎప్పుడైనా… ఆత్మకూర్ వెళ్లి తీరుతానని ప్రకటించారు

చంద్రబాబు ఇంటి ముందు గేట వద్ద పోలీసులు పలువురు టీడీపీ నేతల్ని.. ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నన్నపనేని రాజకుమారి కూడా.. పోలీసులపై మండిపడ్డారు. దీంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడిని పలు స్టేషన్లకు తిప్పారు. చంద్రబాబు ఇంటి వైపు వెళ్తున్న ప్రతీ టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అన్ని దారుల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటుచేశారు. కేశినేని నాని, ఎమ్మెల్సీ దినేష్ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావు, కేఈ ప్రభాకర్‌ , కొనకళ్ల నారాయణ, దేవినేని అవినాష్‌లను రోడ్డుపై అదుపులోకి తీసుకున్నారు.

తీవ్ర నిర్బంధం ఉన్నపప్టికీ.. పోలీసులు అంత సేపు అని.. అలా ఉంచుతారని.. ఎప్పటికైనా వదిలి పెట్టాల్సిందేనని.. వదిలి పెట్టిన తర్వాత తాము ఆత్మకూరుకు వెళ్లి.. కచ్చితంగా… గ్రామస్తులను అక్కడ వదిలి పెట్టి..భరోసా ఇచ్చి వస్తామని… టీడీపీ నేతలు చెబుతున్నారు. దాంతో పోలీసులు తదుపరి వ్యూహంపై దృష్టిపెట్టారు. మరో వైపు తాము కూడా… ఆత్మకూరు వెళ్తామని చెప్పిన వైసీపీ నేతలు … టీడీపీ నేతలపై.. విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు వెళ్తే తామూ వెళ్తామని చెబుతున్నారు. చంద్రబాబు ఆందోళన అంతా.. ప్రీ ప్లాన్డ్ అని.. ప్రజలు నమ్మరని.. వైసీపీ నేతలు… ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close