కేసీఆర్‌కు సమస్య తెచ్చి పెట్టిన జగన్..!

ఏపీ సీఎం ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించారు..!
ఏపీ సీఎం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు..!
ఏపీ సీఎం ఆర్టీసీ అప్పులన్నింటినీ భరించేందుకు సిద్ధమయ్యారు..!
ఏపీ సీఎం ఆర్టీసీ రాయితీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు..!

ఇవన్నీ తెలంగాణ సీఎం ఎందుకు చేయరు..? చేయాల్సిందేనంటూ.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలకు తగ్గట్లుగా … హామీ ఇచ్చి.. ఏపీ సీఎం అమలు చేసినట్లుగా… తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ.. ఆందోళన ప్రారంభించారు. బడ్జెట్‌లో ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం.. ప్రభుత్వం.. వివిధ వర్గాలకు బస్ టిక్కెట్లకు ఇచ్చే రాయితీల కింద.. ఆర్టీసీకి ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా… కేటాయించకపోవడంతో… ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మొత్తం ఏడాదికి రూ. ఆరు నుంచి ఏడు వందల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే.. ఆర్టీసీ దివాలా తీస్తుందన్న భయంతో.. ఉద్యోగులు… ఉద్యమబాట పట్టారు. వారి డిమాండ్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే.

టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ ఆర్టీసికి అప్పులు తక్కువేనని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్.. ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడంతో.. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కూడా ధైర్యం వచ్చింది. పోరాడితే కేసీఆర్ పై కూడా ఒత్తిడి పెరుగుతుందని… ఖచ్చితంగా.. తమ కోరిక నెరవేరుస్తారని నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఆర్టీసీ కార్మికుల కంటే 18 శాతం ఎక్కువగా ఉన్నాయి. విలీనమైతే ఈ వ్యత్యాసం ఉండదు. భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉంటుందని కార్మికులు.. పోరాటానికి సిద్ధమయ్యారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో… కార్మిక సంఘాలన్నింటినీ చీల్చి.. టీఆర్ఎస్‌కు అనుబంధంగా.. ఓ కొత్త కార్మిక సంఘం టీఎంయూని ఏర్పాటు చేశారు. దానికి ఇటీవల కాలం వరకూ.. గౌరవ అధ్యక్షుడిగా హరీష్ రావు ఉండేవారు. ముందస్తు ఎన్నికలకు ముందు … సమయం కేటాయించలేకపోతున్న కారణం చెప్పి వైదొలిగారు. దీంతో… కార్మిక సంఘాలపై.. టీఆర్ఎస్ పట్టు తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ తో సమ్మెకు వెళ్లేందుకు కార్మికులు సిద్ధమవడం..తెలంగాణ ప్రభుత్వ వర్గాలను కలవరపరిచేదే. ఎందుకంటే.. ఇప్పటికిప్పుడు… ఎలాంటి ఆర్థిక సాయాన్ని ఆర్టీసీకి ప్రకటించే యోచనలో ప్రభుత్వం లేదు. ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలంగా కూడా లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close