చంద్రబాబు జగ్గీ కెమిస్ట్రీ, జామెట్రీ

కొద్ది మాసాల కిందట ఎంఎల్‌ఎ జలీల్‌ ఖాన్‌ బికాంలో మ్యాథమ్యాటిక్స్‌ ఫిజిక్స్‌ గురించి మాట్లాడటంపై ఇప్పటికీ జోకులు నడుస్తున్నాయి. కాని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగ్గీ వాసుదేవ్‌ నడిపిన చర్చ లో కెమిస్ట్రీ జామెట్రీ ప్రధానాంశాలైనాయి. ఇటీవల మాటిమాటికీ ఆనందం అంటున్న చంద్రబాబు దానిపైనే స్వామీజీతో చర్చ పెట్టారు. మనిషికి అనందం ఎలా వస్తుందని చంద్రబాబు అడిగితే స్వామీజీ ప్రతిమనిషికీ ఒక రసాయన ప్రక్రియ(కెమిస్ట్రీ) వుంటుందని జవాబిచ్చారు.దాన్ని సక్రమంగా చూసుకోవాలట. మన సంతోషాలు విచారాలు ఆనందాలు సుఖాలూ అన్నీ ఆ రసాయన క్రియ నుంచే వస్తాయట. ఆ రసాయన క్రియ సరిగ్గా వుండేట్టు చూసుకోవాలని సలహా ఇచ్చేశారు. పైగా మనమంతా ఒక రసాయన సూప్‌లో వుంటామన్నారు.ఆ సూప్‌ గనక గొప్పదా చెడ్డదా అని చూసుకోవాలట.

ఇవన్నీ వింటుంటే తలతిరగడం లేదా? అయితే ఆగండి. మరి మన రసాయన క్రియ సరిగ్గా వుండాలంటే ఏం చేయాలో కూడా ఆయనే చెప్పారు. ప్రపంచంలో భౌతికమైన(ఫిజికల్‌) ప్రతిదీ ఒక రేఖా గణితం( జామెట్రీ ) ప్రకారం పనిచేస్తుందట. మన కెమిస్ట్రీ గనక జామెట్రీ ప్రకారం సరిగా వుంటే అంతా హాయిగా నడిచిపోతుందట. ఇది స్వామీజీ దివ్వ సందేశ సారం. ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్‌ జామెట్రీ ఏమిటా అని జుట్టుపీక్కుంటే అది మీ తప్పే. ఈ సమయంలోనే అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా స్వామీజీ కొన్ని సూక్తులు చెప్పారు. అంతిమంగా అంతా నీ చేతుల్లో లేదని కూడా తేల్చేశారు.

ఇంతకూ రాజకీయాలకూ ఈ రసాయనాలకు ఏమైనా సంబంధముందా అద్యక్షా? ఆ ఎంఎల్‌ఎ ఎవరినో అంతగా అపహాస్యం చేశాము గదా ఈ మెట్టవేదాంతంపై పెదవి విప్పలేమా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close