చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్..! కాపు రాజకీయంలో ప్రతిపక్షాలే సమిధలు..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు.. విపక్ష పార్టీలు ఊహించనన్ని ట్విస్టులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నేరుగా ప్రతి ఒటరుకు… లబ్ది చేకూర్చేలా పథకాలు ప్రకటిస్తున్నారు. ప్రకటించడమే కాదు.. ఓటేసే ముందు.. వారికి ఆ లబ్ది అందేలా చేయబోతున్నారు. అదంతా ఓ ఎత్తు అయితే.. కాపు కోటాపై తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం మరో ఎత్తు. రిజర్వేషన్ల విషయంలో జరిగిన ఉద్యమంతో.. వచ్చిన మైనస్ అంతా.. ఒకే ఒక్క నిర్ణయంతో ప్లస్‌గా మార్చుకుంటున్నారు. కానీ విపక్ష పార్టీలు మాత్రం.. ఇదంతా రాజకీయం అని గగ్గోలు పెడుతున్నాయి.

చంద్రబాబుది పక్కా రాజకీయం..!

కాపులకు రిజర్వేషన్లు ఇస్తామనేది.. చంద్రబాబు ఎన్నికల హామీ. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటి సారి ముఖ్యమంత్రి కావడానికి ఇచ్చిన హామీల్లో ఇది అత్యంత కీలకమైనది. ఆయన గెలిచారు కానీ… రిజర్వేషన్లు రాలేదు. రాలేదేమని.. ఇవ్వలేదేమని అడిగిన కాపు నాయకులు ఎవరూ లేరు. కానీ.. చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా… ప్రభుత్వం తరపున ఎంత చేయాలో.. అంత చేస్తూ.. బీసీ కమిషన్ వేసి.. నివేదిక తెప్పించుకున్నారు. దాని ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపారు. కానీ.. షెడ్యూల్ నైన్‌లో పెడితే తప్ప.. ఆ తీర్మానం చెల్లుబాటు కాదు. నేరుగా టీడీపీ ప్రభుత్వమే… కేంద్రంలో ఉన్నా..అదంతా తేలిక కాదనేది..అందరికీ తెలిసిన విషయం. కానీ చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేశారు. అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోయింది. చంద్రబాబు తన సిన్సియార్టీ తాను నిరూపించుకున్నానని.. ఇక బీజేపీ చేతుల్లోనే ఉందని చెబుతున్నారు.

కాపుకోటాను వ్యతిరేకించే సాహసం చేయగలవా..?

ఇలాంటి సమయంలోనే.. కేంద్రమే.. చంద్రబాబుకు ఓ అవకాశం .. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం కోటాతో ఇచ్చింది. కేంద్రం ఈ బిల్లును పాస్ చేసినా… రాష్ట్రాల్లో అమలు చేయాలంటే.. చట్టాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాలి. ఇలా చేసే ముందు.. మార్పులు చేసుకోవచ్చు. అందుకే.. తాను కాపులకు ఇవ్వదలుచుకున్న ఐదు శాతం కోటాను.. ఈ పది శాతంలో చేర్చి… అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి తాను ఎంత చిత్తశుద్ధితో ఉన్నానో చెబుతూ.. ప్రజల వద్దకు వెళ్లబోతున్నారు. చంద్రబాబు నిర్ణయంపై .. తెలుగుదేశం పార్టీ కాపు నేతలు.. సంబరాలు జరిపారు. వారి అనుచరులు చంద్రబాబు పాలాభిషేకాలు చేశారు. అనుబంధ సంస్థలు… హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. ఓ రకంగా.. కాపుల్లో పాజిటివ్ వాతావరణం వచ్చిపడింది. దీనిపై.. వైసీపీ, బీజేపీ మాత్రం వేరుగా స్పందించాయి. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం తమకు ఇష్టం లేదని చెప్పలేరు కాబట్టి… అలా చట్టాన్ని మార్చడం సాధ్యం కాదని కొందరు… అగ్రవర్ణాల మధ్య చిచ్చు పెడుతున్నారని మరికొందరు తమకు ఇష్టం వచ్చిన బాష్యం చెప్పుకుని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

అగ్రవర్ణాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో సక్సెస్ అవ్వగలవా..?

కానీ.. చట్టాన్ని మార్చుకోవచ్చు.. అసెంబ్లీకి ఆ ఆధికారం ఉందని.. చంద్రబాబు.. అసెంబ్లీ సమావేశాల్లోనే నిరూపించబోతున్నారు. ఇక అగ్రవర్ణాల మధ్య చిచ్చు అంటూ మరికొందరు మాట్లాడుతున్నారు కానీ.. అసలు.. ఆ పదిశాతం కోటా అగ్రవర్ణాలకు కానే కాదని.. కేంద్రం పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పింది. అది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి మాత్రమే కోటా. అది ఏ సామాజికవర్గం అయినా.. అగ్రవర్ణం అయినా… వెనుకబడిన వర్గం అయినా సరే.. ఎవరైనా ఆ కోటాలోకి వస్తారు. అలాంటిది.. అగ్రవర్ణాల మధ్య చిచ్చు అనేది ప్రజల్లోకి ఎక్కే పాయింట్ కాదు. ఇది వాళ్లకీ తెలుసు. కానీ ఏం చేయాలో తెలియక.. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెబుతున్నారు. అగ్రవర్ణాలకు ఇచ్చిన రిజర్వేషన్లు తగ్గిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. వాస్తవంగా ఏది చెప్పాలో అది చెప్పలేకపోతున్నారు.

కాపు కోటాలో ప్రతిపక్షలు కుడితిలో పడ్డ ఎలుకలేనా..?

నిజానికి… ఇక్కడే అసలు పాయింట్ ఉంది. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లను.. ఈడబ్ల్యూఎస్ పదిశాతం కోటాలో కేటాయిస్తే.. అసలు అది నిలబడే అవకాశమే లేదు. ఎందుకంటే.. ఇవి కులాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన కోటా. ఈ కోటాలో కులానికి మళ్లీ ప్రత్యేకంగా.. కోటా కేటాయించడం అనేది న్యాయపరంగా నిలబడే ప్రక్రియ కాదు. దీన్ని విడమర్చి ప్రజలకు చెప్పడం విపక్షాలకు చేత కాదు. ఈ విషయం విపక్షాలకు తెలియక కాదు. ఇలా న్యాయపరంగా వెళ్తామని .. రిజర్వేషన్లను అడ్డుకుంటామని… వారు చెప్పలేరు. అది రాజకీయం. చంద్రబాబు వారిని అలా ఫిక్స్ చేశారు. ఇక ఏ విధంగా వారు కాపుకోటాపై వ్యతిరేకంగా మాట్లాడినా.. అది వారి పార్టీలకే నష్టం. అందుకే చంద్రబాబు నిర్ణయంపై.. వారేమీ మాట్లాడలేరు. అంతకు మించి.. అసెంబ్లీని బాయ్ కాట్ చేయడమే ఉత్తమమైన నిర్ణయం అనుకుంటారు. అదే జరగబోతోంది. ఎంతైనా .. చంద్రబాబు రాజకీయం వేరుగా ఉంటుంది.. !

సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close