పాపం… బీజేపీ..! రూ. వంద కోట్లిచ్చి.. ఛీ కొట్టించుకుంది..!

భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పే రాజకీయ ఘటన ఇది. అంతులేని అధికారం అనుభవిస్తున్నప్పుడు…తిరుగులేదని అనుకుంటున్న సమయంలో వివిధ రాష్ట్రాల్లోని మిత్రపక్షాలను.. అమాంతం మింగేసి.. తాను బలపడాలనే ప్రయత్నాలకు.. ఇప్పుడు.. రివర్స్ ఎటాక్‌లు ఎదురవుతున్నాయి. దశాబ్దాలుగా మిత్రపక్షంగా ఉన్న శివసేన సైతం బీజేపీకి దూరం జరిగింది. బీజేపీతో పొత్తు లేదని చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం.. శివసేనతో పొత్తు లేకపోతే.. మహారాష్ట్రలో ఖర్చైపోతామని.. భయపడుతోంది. ఒకప్పుడు… ఒకే భావజాలం ఉన్న ఆ పార్టీని లేకుండా చేస్తే..మహారాష్ట్రలో తాము మాత్రమే కింగ్‌లుగా ఉంటామనుకునుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం.. పొత్తుల కోసం కాళ్ల మీద పడిపోవడానికి రెడీ అయిపోయింది.

శివసేనను కబళించే ప్రయత్నాలు, మోడీ, అమిత్ షా చేసినట్లు తెలిసిన వెంటనే.. ఆ పార్టీ బీజేపీకి దగ్గరగా దూరంగా… వ్యవహరించడం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ… ప్రతిపక్ష నేతలను మించి బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఒంటరి పోటీకి రెడీ అయ్యామని.. బీజేపీతో పొత్తు ఉండదని.. చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. పార్టీలో అధికారికంగా తీర్మానం కూడా చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో… ఎలాగైనా శివసేనను మచ్చిక చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ.. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ముంబైలో నిర్మిస్తున్న బాల్‌థాకరే మెమోరియల్ నిర్మాణానికి ప్రభుత్వం తరపున రూ. 100 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వంద కోట్లతో అయినా శివసేన మనసు మారుతుందని ఆశించింది. అయితే.. రూ. బాల్ థాకరే మెమోరియల్‌కు రూ. వంద కోట్లు ఇవ్వడాన్ని స్వాగతించిన శివసేన.. పొత్తుల విషయంలో.. మార్పేమీ లేదని.. బీజేపీతో కలిసి పోటీ చేసే ఆలోచనే చేయడం లేదని ప్రకటించి షాక్ ఇచ్చింది.

అయితే.. ఈ షాక్‌లోనూ ఓ ట్విస్ట్ ఇచ్చింది శివసేన. మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా కాకండా… నితిన్ గడ్కరీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. మద్దతు గురించి ఆలోచిస్తామని చెప్పింది. అంటే.. ఇక్కడా నేరుగా ఇస్తామని చెప్పలేదు. కానీ… ఆలోచిస్తామన్నది. అంటే.. ఇచ్చినా.. ఇవ్వకపోయినా… ఇది బీజేపీలో ఓ రకంగా చిచ్చు పెట్టే వ్యవహారమే. మోడీ, షాలు… ఇప్పటికే గడ్కరీపై అనుమానం చూపులు చూస్తున్నారు. కొత్తగా.. శివసేన కూడా.. గడ్కరీనే ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూండటంతో.. వారికి నిద్రపట్టని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వచ్చే ఎన్నికల తర్వాత మిత్రపక్షాలకే కీలకం కాబోతున్న తరుణంలో శివసేన వైఖరి వారికి ఆందోళన కలిగించేదే మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close