చైతన్య : అధికారం ఉన్నప్పుడు ప్రత్యర్థుల్ని నిర్మూలించని చంద్రబాబుకు ఈ శిక్ష పడాల్సిందే !

ప్రతి మీటింగ్‌లోనూ ముసలాయన అని చంద్రబాబునాయుడ్ని ఎద్దేవా చేస్తారు సీఎం జగన్ రెడ్డి. ఆయన నిజంగా వృద్ధుడే. ఆయన వయసు 73 ఏళ్లు. 28వ ఏట నుంచి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో ఉన్నారు. ఎవరికీ వారసుడు కాదు. ఆయన రాజకీయాలు ప్రత్యేకం. ఆయన ఇంత వరకూ ఎవరిపైనైనా కక్ష సాధింపులకు పాల్పడ్డారా అంటే లేదు. ఆయనను కులం పేరుతో వ్యతిరేకించే వాళ్లు ఉన్నారు. ప్రాంతం పేరుతో వ్యతిరేకించే వాళ్లు ఉన్నారు. కానీ ఏదైనా రాజకీయంగానే . వ్యక్తిగత స్థాయిలో ఆయనపై శత్రుత్వం పెంచుకుని .. కుటుంబాన్ని తిట్టించి… ఎక్కడికి వెళ్లినా రాళ్లు వేయించి హత్యాప్రయత్నాలు చేసి.. ముసలాయన అంటూ నిందించి… ఎన్ని చేసినా ఆయన ఆయన ఇంకా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఇప్పుడు జైలుకు పంపినా… నాకెందుకు అనుకునే మనస్థత్వం కాదు ఆయనది.

ముసలాయన ఇప్పటికీ ఫస్ట్ టార్గెట్ – అదే ఆయన క్రెడిట్ !

పధ్నాలుగేళ్లు సీఎం. పదేళ్లు సీఎంగా ఉండి… తెలుగు యువత రాతను మార్చేసే నిర్ణయాలు తీసుకున్నారు. ఐటీ రంగాన్ని ఏపీకి తెచ్చారు. అహ్మదాబాద్, లక్నో, జైపూర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నగరాలున్నా… బెంగళూరు వైపు అప్పటికే ఐటీ రంగం చూపు పడినా చంద్రబాబు కష్టపడి కంపెనీలు తెచ్చి ఓ మహానగరాన్ని స్వప్నించారు. చేసి చూపించారు. హైదరాబాద్ లో ఎంట్రీలో కనిపించే సరూర్ నగర్ స్టేడియం.. ఆటు చివర కనిపించే గచ్చిబౌలి స్టేడియం సహా తొమ్మిదేళ్లలో ఆయన హైదరాబాద్ రూపు రేఖలు మార్చారు. ఆ తర్వాత పదేళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా లేరు. తర్వాత వచ్చిన పాలకుల నిర్వాకంతో రాష్ట్రం రెండు ముక్కలు అయింది. విడిపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టాడనికి ఐదేళ్లలో ఆయన చేసిన పని.. చూపించిన పని తనం కళ్ల ముందే ఉంది. ఆయన కట్టించిన ఆఫీసుల్లో కూర్చుని పనులు చేస్తూ ఆయన మీదే కుట్రలు చేస్తున్నారు. ఆయన వాటిని ఎదుర్కొంటారు.

అధికారం మొత్తం వాడినా నాలుగున్నరేళ్ల వరకూ జైల్లో పెట్టలేకపోవడమే ముసలాయన స్టామినా !

ముసలాయన్ని గెలవాలంటే…. కులం పేరుతో రెచ్చగొట్టాలి. అధికారంలోకి వచ్చాక గెలవాలంటే ఇంటికి పది లక్షలు పంచాలి.. లేకపోతే గెలవలేం. అనే స్థాయి ఆయనది. ఇప్పుడు ఆయన్ను జైలుకు పంపించారని విర్రవీగిపోతున్నారు. రాజకీయాల్లో అధికారం పోయినవాడు ఎవడైనా ఇప్పుడు జైలుకు పోవాల్సిందే. ఏ ఆధారామూ లేని కేసులో మాజీ సీఎంను ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్ట్ చేయగలగారు. 24 గంటలు కస్టడీలో ఉంచుకున్నారు. మరో పద్దెనిమిది గంటలు కోర్టులో కూర్చోబెట్టారు. కావాల్సినంత డ్రామా నడిపించారు. ఆయన వయసు.. దేశానికి చేసిన సేవ కూడా ఏ వ్యవస్థా గౌరవం ఇవ్వలేదు. ప్రజల్ని దోచుకుని కుటుంబసభ్యుల్ని చంపుకున్న వారికే వత్తాసు పలుకుతున్నాయి. ఒక్క రోజు చంద్రబాబును జైల్లో పెట్టగలిగాం అని.. సంతృప్తి పడొచ్చు.. ఈగో శాటిస్ ఫై కావొచ్చు.. కానీ ఇది చేయాలంటే.. ఎన్ని తప్పుడు పనులు చేయాల్సి వచ్చిందో గుర్తు చేసుకుంటే… ముసలాయన స్టామినా ఎలా ఉందో అర్థం అవుతుంది

ముసలాయన ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుంటారు ! జస్ట్ టైమ్ ఆఫ్ మ్యాటర్

ఆ ముసలాయన జీవితంలో ఇప్పటికే సాధించాల్సింది… . కోల్పోవాల్సింది కూడా ఏమీ లేదు. పధ్నాలుగేళ్లు సీఎంగా ఉన్నారు. తన పదవీ కాలంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత చేశారు. ఆ సంతృప్తి ఆయనకు ఉంటుంది. ప్రతిపక్ష నేతగా ప్రజల కోసం పోరాడారు. అదీ కూడా ఆయనకు సంతృప్తి ఉంటుంది. ఆయన విధానాల వల్ల బాగుపడి… ఉద్యోగాలు తెచ్చుకుని కుటుంబాలను పోషించుకుని ఉన్నత స్థాయికి వెళ్లిన వారికి కృతజ్ఞత ఉంటే గుర్తుంచుకంటారు లేకపోతే కులం పేరుతో తిట్టిపోతారు కానీ ఆయన చేసిన మేలు మాత్రం ఎవరూ కాదనలేరు. ఈ మొత్తం విషయంలో తెలుసుకోవాల్సిందేమిటంటే.. ఆయన ఓ ఫైటర్. ఎంతో కష్టపడి పని చేసినా 23 సీట్లు వచ్చినా తట్టుకుని మళ్లీ పోరాడటం అంటేనే ఆయన మైండ్ స్ట్రెంత్ అర్థం చేసుకోవచ్చు. ఇదో సంక్షోభం అనుకుంటారు. అనుకున్నది సాధిస్తారు.. .. జస్ట్ టైమ్ ఆఫ్ మ్యాటర్ !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూల్స్ రంజన్.. సూపర్ కాన్ఫిడెన్స్

ఈవారం వస్తున్న ప్రామెసింగ్ సినిమాల్లో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' ముందువరుసలో వుంది. కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడు ఇమేజ్ తో చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. రూల్స్ రంజన్ ఆ...

సిద్దార్థ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !

సిద్ధార్థ్ కి సినిమాలు కలసిరావడం లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఏదీ నిలబడటం లేదు,. హిట్టు అనే మాట రావడం లేదు. ఇటివలే టక్కర్ అనే సినిమా చేశాడు. సిద్ధార్థ్ పై...

లోకేష్‌పై అసలు ఎఫ్ఐఆర్లే లేవని చెబుతున్న సీఐడీ

లోకేష్ ను అరెస్టు చేయడం ఖాయమని ఊగిపోయిన సీఐడీ ఇప్పుడు ఆయన పేరు ఇంకా ఎఫ్ఐఆర్‌లో పెట్టలేదని చెబుతోంది. ఐఆర్ఆర్ కేసులో ఏ 14గా చేర్చి.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా ఢిల్లీ వెళ్లి .....

హిందీలో మార్కులు కొట్టేసిన రవితేజ

రవితేజ చక్కని హిందీ మాట్లడతారు. ఆయన నార్త్ లో కొన్నాళ్ళు వుండటం వలన హిందీ అలవాటైయింది. ఇప్పుడీ భాష 'టైగర్ నాగేశ్వరరావు' కోసం పనికొచ్చింది. రవితేజ కెరీర్ లో చేస్తున్న మొదటి పాన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close