చంద్రబాబు చీప్‌గా మాట్లాడుతున్నారన్న జగన్

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే తప్పులు చేస్తూ చీప్ సీఎమ్‌గా మారిపోయారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ మధ్యాహ్నం లోటస్ పాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ, బాబు తన తప్పులను ఎదుటివారిపై రుద్దేందుకు ఏ స్థాయికైనా దిగజారేందుకు వెనకాడటంలేదని ఆరోపించారు. చంద్రబాబు నిన్న చాలా సుదీర్ఘమైన ఆత్మస్తుతి పరనింద కార్యక్రమం కొనసాగించారని అన్నారు. ఇంత చీప్‌గా ఒక సీఎమ్ మాట్లాడటం ఏపీ చరిత్రలోనే ఎప్పడూ లేదని చెప్పారు. నిన్నటి మీడియా సమావేశంలో కాపులకు తానేం చేస్తానో మాత్రం చంద్రబాబు చెప్పలేదని అన్నారు. కాపులకు ఐదు సంవత్సరాల్లో ఐదువేల కోట్లు కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేస్తామని టీడీపీ మ్యానిఫెస్టోలో చెప్పలేదా అని అడిగారు. చంద్రబాబు ప్రతి కులాన్నీ, వర్గాన్నీ, మతాన్నీ మోసం చేశారని ఆరోపించారు. తానన్న మాటలనే మరిచి కాపువర్గం ఆగ్రహానికి గురైన చంద్రబాబు గద్దే దిగే రోజులు త్వరలోనే రానున్నాయని జగన్ జోస్యం చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో “వన్ ఇయర్” మార్పు..! సజ్జలే నెంబర్ టూ..!?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ ఎవరు అంటే.. అందరూ.. ఎంపీ విజయసాయిరెడ్డి పేరును మొదటి ఆప్షన్‌గా పెడతారు. ఎందుకంటే.. అంత క్రియాశీలకంగా ఉంటారు ఆయన. అటు ఢిల్లీలో పరిస్థితుల్ని...

బీజేపీ గవర్నరేగా సంతకం పెట్టింది..! ఎలా స్వాగతిస్తున్నారు..?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పోటీలు పడి స్వాగతించారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి...

ఫిరాయించిన ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు..!?

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా.. వైసీపీ గూటికి చేరిపోయిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హతా వేటు వేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది....

ఏడాది యాత్ర 11 : అంచనాలు ఎక్కువ… ఆచరణ తక్కువ..!

ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ తట్టులేకపోతున్నాను భయ్యా..! .. అంటాడు ఓ సినిమాలో హీరో. నిజంగానే ఆ సినిమాకు హైప్ ఓ రేంజ్‌లో వచ్చింది. ఎంతగా అంటే.. సినిమా ఎంత అద్భుతంగా తీసినా .....

HOT NEWS

[X] Close
[X] Close