ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చంద్రబాబు వెళ్తున్నారు. ఎన్డీఏ కూటమి పార్టీలతో పాటు విపక్ష పార్టీలకు చెందిన వారికి కూడా ఆహ్వానాలు పంపుతారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతం.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కీలక పార్టనర్‌గా టీడీపీ చురుగ్గా వ్యవహరించింది. రామ్మోహన్ నాయుడు ఏజెంట్ గా ఉన్నారు. ఏపీ ఎన్డీఏ ఎంపీలందర్నీ లోకేష్ సమన్వయం చేశారు. ఇందు కోసం ఆయన స్వయంగా ఢిల్లీకి వచ్చారు. చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది. లోకేష్ ఇటీవల ప్రధాని మోదీని కలిసి దాదాపు గంట సేపు వివిధ అంశాలపై మాట్లాడారు. వాటికి కొనసాగింపుగా.. కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఏపీలో రాజకీయ పరిణామాలు వచ్చే కొద్ది రోజుల్లో కీలకంగా మారనున్నాయి. తమ అరాచకాలన్నీ బయటపడే స్థాయికి చేరుకున్నాయని విపక్ష నేత ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. బీజేపీకి ఎంత జోకినా ఆయన కేసుల నుంచి బయటపడటం అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
