ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు..! పర్మిషన్ ఇస్తారా..?

వైసీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసి.. అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన చంద్రబాబును పోలీసులు రేణిగుంట ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ఈ సారి చంద్రబాబు వ్యూహం మార్చారు. నేరుగా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఐదు రోజుల పాటు ఐదు కీలక జిల్లాల్లో చంద్రబాబు పర్యటించబోతున్నారు. గురువారం నుంచి ప్రచారం ప్రారంభమవుతంది. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కీలకమైన ప్రాంతాలే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పార్టీల అధ్యక్షులు పాల్గొనడం అరుదే.

అధికార పార్టీ అధ్యక్షులు.. ముఖ్యమంత్రులు అయితే పాల్గొనరు కానీ.. అధికార బాధ్యలేమీ లేకుండా ప్రతిపక్షంగా రాజకీయం చేసుకోవడమే పనిగా ఉన్న పార్టీలు మాత్రం.. ఎన్నికల్లో ఎలాంటి అవకాశాన్ని వదిలి పెట్టవు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కన్నా ఎక్కువ స్థానాల్లో గెలిచి అధికార వ్యతిరేకత తీవ్రంగా ఉందని నిరూపించాలనుకుంటున్న చంద్రబాబు.. ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు చంద్రబాబుకు అత్యంత కీలకం. రాజధాని, స్టీల్ ప్లాంట్ అంశాలు ఈ జిల్లాల్లో ఓటర్లపై కీలక ప్రభావం చూపించనుంది. దీన్ని అనుకూలంగా మల్చుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఇప్పటి వరకూ చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని మాత్రం అడ్డుకునే పరిస్థితి ఉండదు.

కోడ్ ఉందని.. కోవిడ్ ఉందని చెప్పే అవకాశం కూడా ఉండదని టీడీపీ నేతలంటున్నారు. అయితే ప్రభుత్వం అడ్డుకోవాలనుకుంటే.. చంద్రబాబును ప్రచారం చేయనివ్వకుండా అడ్డుకోగలదని గత అనుభవాలు చెబుతున్నాయని మరికొంత మంది నేతలంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఎన్నికల ప్రచారం హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close