30 కోట్ల చీకటి డీల్ వెనక ఉన్నది విష్ణువర్ధన్ రెడ్డి మరియు జీవీఎల్: సిపిఐ రామకృష్ణ

ఆంధ్రజ్యోతి పత్రిక తాజాగా రాసిన కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు బిజెపి నేతలు 30 కోట్ల రూపాయల చీకటి లావాదేవి చేశారని, అది కేంద్ర నిఘా సంస్థల దృష్టికి వెళ్లిందని, బిజెపి కేంద్ర పెద్దల దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్లిందని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్థాయి వ్యవహారం కావడంతో ఆ ఇద్దరు బిజెపి నేతలపై హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అయితే పార్టీ నుండి సస్పెన్షన్ ఆ లేక అన్నది తెలియదని ఆ పత్రిక కథనాన్ని రాసింది. అసలు ఇంత పెద్ద చీకటి వ్యవహారం వెనకాల ఉన్న ఆ ఇద్దరు కమలనాథులు ఎవరన్న సస్పెన్స్ లో ఆ వార్తను చదివిన పాఠకులు ఉండగా, సిపిఐ రామకృష్ణ ఈ వ్యవహారం వెనుక ఉన్న నేతలు విష్ణువర్ధన్ రెడ్డి మరియు జీవీఎల్ అని బాంబు పేల్చారు. వివరాల్లోకి వెళితే..

ఆశ్రమంలో 400 కోట్ల రూపాయల అవకతవకలు, చేతులు మారిన 30 కోట్లు:

పత్రిక కథనం ప్రకారం, రాయలసీమలో నడిచే ఒక ప్రముఖ ఆశ్రమంలో 400 కోట్ల మేరకు ఆర్థిక అవకతవకలు కేంద్ర నిఘా సంస్థల దృష్టికి వచ్చాయని, ఆదాయపు పన్ను శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ ఆశ్రమం పై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారని, అయితే రాయలసీమకు చెందిన ప్రముఖ బీజేపీ నేత ఆశ్రమంలోని కీలక వ్యక్తుల తో టచ్ లోకి వచ్చారని, ఈ వ్యవహారంలో ఆశ్రమానికి ఇబ్బంది కలగకుండా ఢిల్లీకి చెందిన అధికారులను తాను మేనేజ్ చేస్తానని ఆశ్రమ నిర్వాహకుల ను ఒప్పించారని, తన తో పాటు మరొక బిజెపి నేత ను కూడా ఈ వ్యవహారంలో కి తీసుకొచ్చారని, ఆ ఇద్దరూ కలిసి ఢిల్లీకి చెందిన అధికారి ని తిరుపతి రప్పించారని, ఇద్దరు బిజెపి నేతలు మరియు ఆ అధికారి కలిసి ఆశ్రమ నిర్వాహకుల నుండి 30 కోట్ల దాకా తీసుకున్నారని, ఆశ్రమం పై జరుగుతున్న దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, కథనం సారాంశం. అయితే వచ్చిన అధికారి నిజమైన అధికారా లేక బిజెపి నేతలు అధికారి పేరిట తీసుకువచ్చిన వ్యక్తా అన్నది తెలియడం లేదన్నది కథనం లో రాసిన మరొక పాయింట్. ఈ వ్యవహారం అమిత్ షా వరకు చేరిందని, ఆయన ఆంధ్ర ప్రదేశ్ పర్యటన సందర్భంగా వీరిపై చర్యలు ఉండే అవకాశం ఉందని పత్రిక రాసుకొచ్చింది.

ఆ ఇద్దరు బిజెపి నేతలు విష్ణువర్ధన్ రెడ్డి మరియు జీవీఎల్: సిపిఐ రామకృష్ణ

సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కూడా ఈ వ్యవహారంపై స్పందించడమే కాకుండా ఈ వ్యవహారంలో ఉన్న రాయలసీమ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అని , మరొక నేత జీవీఎల్ అని పజిల్ సాల్వ్ చేశారు. వీరిద్దరు కలిసి చేస్తున్న అక్రమాలను ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా విష్ణువర్ధన్ రెడ్డి , జీవీఎల్ – ఇద్దరు నేతలు కూడా పలు సందర్భాలలో వివాదాస్పదం అవుతున్నారు. అధికార వై ఎస్ ఆర్ సి పి పార్టీ తో లోపాయికారిగా సహకరిస్తున్నారని వీరిద్దరిపై చాలాకాలంగా రూమర్స్ వస్తున్నాయి. ఇక ఇటీవలే ఏబీఎన్ ఛానల్ లో విష్ణు వర్ధన్ రెడ్డి పై ఒక నేత చెప్పుతో దాడి చేసినప్పటికీ , విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించక పోవడానికి కారణం కూడా ఈ చీకటి వ్యవహారానికి సంబంధించిన డీటెయిల్స్ ఆ ఛానెల్ వద్ద ఉండడమే అని మరొక రూమర్ వినిపిస్తోంది.

ఇంతకీ ఈ కథనం పూర్తిగా నిజమేనా, లేక పూర్తిగా అసత్య ఆరోపణా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమే గనుక అయితే, అవినీతిని సహించము అని చెప్పే బిజెపి పెద్దలు, వీరిద్దరి పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close