అమరావతి విషయంలో ప్రధానిపై భారం వేస్తున్న చంద్రబాబు..!

అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు పూర్తయిన సందర్భంగా… దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు..వర్గాలు..మేధావుల నుంచి మద్దతు లభిస్తోంది. వర్చవల్ పద్దతిలో అందరూ.. పెద్ద ఎత్తున తమ సంఘిభావం తెలియచేస్తున్నారు. ఇలా తెలియచేసిన వారిలో చంద్రబాబు కూడా ఉన్నారు. మిగతా వారి సంగతేమో కానీ.. చంద్రబాబు మాత్రం.. తన ప్రసంగంలో.. అమరావతిని కాపాడేది… కాపాడే సామర్థ్యం ఉన్నది.. ఒక్కరికేనని తేల్చారు. అది మరెవరో కాదు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రైతులకు సంఘిభావం తెలిపిన సందర్భంగా.. గతంలో అమరావతి గురించి చెప్పే గొప్ప మాటలతో పాటు.. ఈ సారి ప్రధాని మోడీ ఇచ్చిన హామీల గురించి ప్రధానంగా ప్రస్తావించారు.

2014 ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ కంటే మెరుగైన రాజధాని నిర్మిస్తామని హమీ ఇచ్చారని.. పార్లమెంట్‌ ఆవరణలోని మట్టి, యమునానది జలాలను తీసుకొచ్చి అండగా ఉంటామని చెప్పారని గుర్తు చేశారు. అందుకే అమరావతిని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైన కూడా ఉందన్నారు. సేవ్‌ అమరావతి..సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ నినాదం కొనసాగించాలని అమరావతి రైతులకు పిలుపునిచ్చారు. అమరావతి విషయంలో.. ఏపీ సర్కార్ ఇప్పుడు ముందడుగు వేయలేకపోతోంది. రకరకాల సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా ఉద్ధృతి పెరుగుతోంది కానీ తగ్గే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో… రాజధానిని మార్చే ఆలోచనను.. జగన్ చేయకపోవచ్చంటున్నారు. ఈ మేరకు.. మంత్రి పెద్దిరెడ్డి లాంటి వాళ్లు కూడా కొన్ని సంకేతాలు ఇచ్చారు.

ప్రస్తుతం.. భారతీయ జనతా పార్టీతో.. వైసీపీ సంబంధాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. రఘురామకృష్ణంరాజు ఇష్యూతో తమ వెనుక ఏదో జరుగుతోందన్న అభిప్రాయం.. వైసీపీలో ప్రారంభమయింది. అందుకే.. వైసీపీ నేతలు బీజేపీపై ఎటాక్ చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు..కూడా… అమరావతికి మద్దతు తెలుపుతున్నారు. దీని ఆధారంగా.. చంద్రబాబు బీజేపీపై వ్యూహత్మకంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది సక్సెస్ అవుతుందో లేదో కానీ.. అమరావతి గురించి మోడీ ఇచ్చిన హామీలు.. వెలుగులోకి రావడానికి బీజేపీపై ఒత్తిడి పెరగడానికి మాత్రం ఉపయోగపడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా - మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర - బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా - మిహిక‌లు...

ట‌బుని ఒప్పించ‌డం సాధ్య‌మా?

కొన్ని క‌థ‌ల్ని రీమేక్ చేయ‌డం చాలా క‌ష్టం. ఆ ఫీల్ ని క్యారీ చేయ‌డం, ఆ మ్యాజిక్‌ని మ‌ళ్లీ రీ క్రియేట్ చేయ‌డం సాధ్యం కాదు. కొన్నిసార్లు.. పాత్ర‌ల‌కు స‌రితూగే న‌టీన‌టుల్ని వెదికి...

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు..!

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి...

‘ఈగ’ కాన్సెప్టులో ‘ఆకాశవాణి’?

రాజ‌మౌళి ద‌గ్గ‌ర శిష్యుడిగా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టాడు. 'ఆకాశ‌వాణి' సినిమాతో. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే...

HOT NEWS

[X] Close
[X] Close