బాల‌య్య‌తో అమ‌లాపాల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. `మోనార్క్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. బాల‌య్య పుట్టిన రోజున‌… ఓ ప‌వ‌ర్ ఫుల్ టీజ‌ర్ విడుద‌ల చేశాడు బోయ‌పాటి. దానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. టీజ‌ర్ ని క‌ట్ చేసిన విధానం, అందులోని బాల‌య్య గెట‌ప్‌, ఇచ్చిన పంచ్ – ఇవ‌న్నీ బాల‌య్య అభిమానుల‌కు బాగా న‌చ్చాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాలోని హీరోయిన్ ఖ‌రారు కాలేదు. చాలామంది పేర్లు వినిపించినా – చిత్ర బృందం ఎవ‌రినీ ఫైన‌లైజ్ చేయ‌లేదు. అయితే ఇప్పుడు మ‌రో కొత్త పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా అమ‌లాపాల్ ని ఫిక్స్ చేశార‌ని స‌మాచారం అందుతోంది. నిజానికి ఈ సినిమా కోసం ఓ కొత్త క‌థానాయిక‌ని ఎంచుకోవాల‌నుకున్నారు. దాని కోసం ఆడిష‌న్స్ కూడా చేశారు. కానీ… బాల‌య్య‌కు స‌రైన జోడీ దొర‌క‌లేదు. కొత్త‌మ్మాయిల‌తో రిస్క్ తీసుకోవ‌డం ఇష్టం లేక అమ‌లాపాల్ ని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌ర‌మ్మాయిల‌తో.. సినిమాతో ఓ మెరుపులా మెరిసింది అమ‌లా. ఆ త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్ హీరో తో న‌టించినా పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. ఈసారైనా.. తెలుగులో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ దొరుకుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

పూరి గ‌ట్స్‌.. రెండ్రోజుల ముందే ప్రీమియ‌ర్‌

సినిమాకి టాక్ చాలా ముఖ్యం. పాజిటీవ్ టాక్ వ‌స్తే - క‌ల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఏమాత్రం తేడా వ‌చ్చినా - ఫ‌ట్‌మ‌న‌డం ఖాయం. రిలీజ్ డే టాక్ అనేది వ‌సూళ్ల‌లో కీల‌క పాత్ర పోషిస్తుంటుంది....

HOT NEWS

[X] Close
[X] Close