ఇక రామ్ చ‌ర‌ణ్… వెబ్ సిరీస్‌

రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌లు వినోద రంగాన్ని ఆక్ర‌మించ‌బోతున్నాయి. సినిమాల్ని మించిన మేకింగ్‌, కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటి ప్రాధాన్య‌త‌ని స్టార్లు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. స‌మంత‌, త‌మ‌న్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్ప‌టికే ఈ రంగంలోకి అడుగు పెట్టేశారు. ఇప్పుడు హీరోల వంతు వ‌స్తోంది.

త్వ‌ర‌లోనే రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా ఓ వెబ్ సిరీస్ మొద‌లు కానున్న‌ద‌ని స‌మాచారం. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో చ‌రణ్ సినిమాల్ని నిర్మిస్తున్నాడు. ఖైదీ నెం.150, సైరా, ఆచార్య చిత్రాల‌కు త‌నే నిర్మాత‌. ఇప్పుడు చ‌ర‌ణ్ ఓ వెబ్ సిరీస్ నిర్మించే ఆలోచ‌న‌ల్లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. భారీ స్టార్లు, సినిమాని మించే బ‌డ్జెట్‌తో.. ఈ వెబ్ సిరీస్‌ని తెర‌కెక్కించాల‌న్న ఆలోచన‌లో ఉన్నాడ‌ట‌. ఇది ఆహా కోస‌మా? మ‌రో ఓటీటీ వేదిక కోస‌మా? అనేది తెలియాల్సివుంది. ఈమ‌ధ్య చిరు కూడా వెబ్ సిరీస్‌ల‌పై ఆస‌క్తి క‌ర‌బ‌రిచాడు. మంచి కంటెంట్ ఉంటే, త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని చెప్పాడు. బ‌హుశా.. చ‌ర‌ణ్ ప్లానింగ్ కూడా చిరంజీవి కోస‌మేనేమో. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ పెట్టిందే చిరు కోస‌మ‌ని చ‌ర‌ణ్ చాలాసార్లు చెప్పాడు. ఆ ప్రొడ‌క్ష‌న్స్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతోందంటే.. చిరు లేకుండా ఎలా? మ‌రి చ‌ర‌ణ్ ప్లానింగ్ ఏమిటో? ఈ వెబ్ సిరీస్ స్పెషాలిటీ ఏమిటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా - మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర - బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా - మిహిక‌లు...

ట‌బుని ఒప్పించ‌డం సాధ్య‌మా?

కొన్ని క‌థ‌ల్ని రీమేక్ చేయ‌డం చాలా క‌ష్టం. ఆ ఫీల్ ని క్యారీ చేయ‌డం, ఆ మ్యాజిక్‌ని మ‌ళ్లీ రీ క్రియేట్ చేయ‌డం సాధ్యం కాదు. కొన్నిసార్లు.. పాత్ర‌ల‌కు స‌రితూగే న‌టీన‌టుల్ని వెదికి...

తెలుగు రాష్ట్రాల సీఎంలకు షెకావత్ మళ్లీ మళ్లీ చెబుతున్నారు..!

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త ప్రాజెక్టుల అంశం కేంద్రానికి చిరాకు తెప్పిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ భేటీ జరిగే వరకూ..కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని జలశక్తి మంత్రి...

‘ఈగ’ కాన్సెప్టులో ‘ఆకాశవాణి’?

రాజ‌మౌళి ద‌గ్గ‌ర శిష్యుడిగా ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టాడు. 'ఆకాశ‌వాణి' సినిమాతో. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషించిన ఈ చిత్రానికి కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే...

HOT NEWS

[X] Close
[X] Close