కాంగ్రెస్ కూటమిలో చంద్రబాబు, జగన్, కేసీఆర్..!

కాంగ్రెస్ కూటమిలో చంద్రబాబు ఉన్నారు. జగన్, కేసీఆర్ కూడా చేరబోతున్నారా..?. ఈ చర్చ మూడో విడత ఎన్నికల నుంచి.. రాజకీయవర్గాల్లో అంతర్గతంగా జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… మీడియాతో పిచ్చాపాటి మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని బయటకు చెప్పారు. అలా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. కాస్త తీరుబడిగా ఆలోచిస్తే.. ఇదేమీ అసాధ్యం కాదనే అంచనాలు రాజకీయవర్గాల్లో వస్తున్నాయి.

కాంగ్రెస్‌తోనే చంద్రబాబు …! మరి జగన్.. కేసీఆర్ కూడానా..?

టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం… నరేంద్రమోడీ మళ్లీ ప్రధాని కాకుండా ఉండటమే. అందుకే ఆయన… మోడీ.. అన్ని రకాలుగా వేధిస్తాడని తెలిసి కూడా.. రాజకీయ గమనాన్ని మార్చుకుని పోరాటం చేశారు. దేశ స్థాయిలో పరిస్థితుల్ని అర్థం చేసుకుని.. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ అవకాశం ఉందన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే ఆ పార్టీకి.. రాహుల్ గాంధీకి.. ఢిల్లీ స్థాయిలో అండగా నిలుస్తున్నారు. ఏపీలో ఉన్న పరిస్థితుల వల్ల.. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకోలేకపోవచ్చు కానీ… టీడీపీని అందరూ కాంగ్రెస్ మిత్రపక్షంగానే చూశారు. ఏపీలో రెండు సార్లు ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ కూడా… పరోక్షంగా టీడీపీనే గెలిపించమని పిలుపునిచ్చి వెళ్లారు. ఈ కారణంగా…చంద్రబాబు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కే స్టిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో లేదా.. కాంగ్రెస్ మద్దతుతో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడితే.. అందులో టీడీపీ కీలక పాత్ర పోషించడం ఖాయమే.

కేంద్రంలో కాంగ్రెస్ ఉంటే టీఆర్ఎస్‌ కు “తప్పని”సరి స్నేహం..!

చంద్రబాబు అత్యంత కీలక పాత్ర పోషించే కాంగ్రెస్ అనుకూల కూటమిలో… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ఎలా కలుస్తారన్నది ఇప్పుడు రాజకీయవర్గాలకు అంతుబట్టకుండా ఉంది. కానీ.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. రాజకీయ పోరాటం.. రాజకీయ పోరాటమే. ఫలితాలొచ్చిన తర్వాత ఎవరి చక్రం వారిదే. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు… పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. అలాగే బలమైన మిత్రపక్షాలు కూడా లేరు. ఈ కారణంగా… బీజేపీ ఈ సారి అధికారానికి దూరం కావడం ఖాయమన్న అంచనా ప్రాంతీయ పార్టీల్లో ఉంది. ప్రాంతీయ పార్టీల కూటమికి ఈ సారి బీజేపీ కానీ… కాంగ్రెస్ కానీ.. మద్దతివ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని కాకలు తీరిన రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ కాకలు తీరిన రాజకీయ నేతల్లో కేసీఆర్ కూడా ఉన్నారంటున్నారు. టీఆర్ఎస్ ప్రత్యక్ష లేదా పరోక్ష మద్దతు లేకుండా కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ మిత్రపక్షాల ప్రభుత్వం ఏర్పడితే.. ఆ ప్రభావం మొట్టమొదటగా టీఆర్ఎస్ పై పడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరుతో… ఆ పార్టీ అగ్రనాయకత్వం రగిలిపోతోందన్న ప్రచారం ఉంది. ఈ తరుణంలో… ఆ ప్రభుత్వంలో తనదైన ముద్ర ఉంటేనే తనకు చిక్కులు లేకుండా ఉంటాయని.. కేసీఆర్ భావిస్తున్నారని ఓ అంచనా ఉంది. అందుకే.. ఆయన కాంగ్రెస్ కూటమి వైపు చూసినా ఇబ్బంది లేదంటున్నారు.

జగన్ కు కేసుల గుదిబండ.. ! ఢిల్లీ సర్కారుకు గులాం కొట్టాల్సిందే..!

ఇక జగన్మోహన్ రెడ్డికి.. మరో దారి లేదు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీతో సాన్నిహిత్యం పెంచుకోక తప్పదు. ఆయనపై ఉన్న కేసులే ఆయనకు గుదిబండలు. ఆయనకు దారి చూపించడానికి కేసీఆర్ రెడీగా ఉన్నారు కాబట్టి… ఈ విషయంలో.. పెద్దగా ఆశ్చర్యార్థకాలు ఏమీ ఉండవు. అవసరం వచ్చినప్పుడు.. చెప్పుకోవడానికి.. తనది కాంగ్రెస్ జీన్స్ అనే.. డైలాగ్ రెడీగా పెట్టుకుని జగన్ ఉన్నారు. తన తండ్రి ఆశయం రాహుల్ గాంధీని ప్రధానని చేయడమేనని ఆయన చెప్పుకుంటారు. ఇప్పటికే జాతీయ మీడియా ఇంటర్యూల్లో. కాంగ్రెస్ పై కోపం లేదని .. చెప్పుకొచ్చారు. ఏ విధంగా చూసినా జగ్గారెడ్డి మాటలు… అతిశయోక్తులు మాత్రం కాదు. కానీ… చంద్రబాబు, జగన్, కేసీఆర్ ఒకే కూటమిలో ఉండగలరా…? అనేది మాత్రం.. ఆసక్తికర అంశం. ఇక్కడ… రాజకీయాల్లో ఓ ఫ్లెక్సిబులిటీ ఉంది.. అదే బయట నుంచి మద్దతు.. లోపలి నుంచి మద్దతు..! ఈ ముగ్గురిలో .. ఎవరు ఏ ఆప్షన్ ఎంచుకుంటారన్నదాన్ని బట్టి.. మిగతా పరిణామాలు ఉండొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close