అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ… ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే… తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని ప్రజలను నమ్మించి ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నందున ప్రజాభిప్రాయం కోరేందుకు అసెంబ్లీని రద్దు చేయాని.. డిమాండ్ చేస్తూ..ఆయన 48 గంటల డెడ్ లైన్ ఇచ్చారు. ఆ డెడ్‌లైన్‌పై వైసీపీ నేతలెవరూ స్పందించలేదు. దీంతో మరోసారి మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు గతంలో… వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు.

రాజధానిపై ఎన్నికల ముందు అమరావతినే కొనసాగిస్తామని చెప్పి… ఇప్పుడు ఐదు కోట్ల మందిని మోసం చేసి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ప్రజలకు ద్రోహం చేయడం నీచమన్నారు. ప్రజాభిప్రాయం కోరేందుకు వైసీపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ప్రజల్లో చైతన్యం..తిరుగుబాటు రావాలని పిలుపునిచ్చారు. వెన్నెముక లేని నాయకులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని .. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలన్నారు. రాజధాని అమరావతికి జగన్‌ ఒప్పుకుంది వాస్తవం కాకపోతే… మీరు చేసింది న్యాయమని విశ్వాసం ఉంటే.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. రాజధాని విషయంలో చాలా నష్టం జరుగుతోందని భూములు ఇచ్చిన రైతులు రోడ్డునపడి బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కు ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళ్లాలని .. ఎన్నికలంటే జగన్‌ పారిపోతున్నారని విమర్శించారు.

కేంద్రం జోక్యం చేసుకొని రాజధానిని కాపాడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అంటున్నారు. రాజధాని రైతులకు జరుగుతోన్న అన్యాయంపై.. వైసీపీ నేతలు జగన్‌ను నిలదీయాల్సి ఉందన్నారు. సోషల్‌మీడియా ద్వారా మనోభావాలు చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండు రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వస్తాననని రాజధాని అమరావతిపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తానని స్పష్టం చేశారు.

గతంలో అమరావతికి మద్దతుగా వైసీపీ నేతలు మాట్లాడిన వీడియోలను…టీడీపీ నేతలు ఇంతకు ముందు విస్తృతంగా సోషల్ మీడియాలోప్రచారానికి పెట్టారు. చంద్రబాబు కూడా వాటిని ప్రదర్శించారు. చంద్రబాబు సవాల్‌పై… గతంలో అమరావతికి మద్దతుగా తాము మాట్లాడిన మాటలపై..ఒక్క వైసీపీ నేత కూడా స్పందించలేదు. దీంతో వైసీపీ కిక్కురుమనకుండా ఉంటోందన్న చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అన్‌లాక్ 5.0 : ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లకు గ్రీన్ సిగ్నల్..!

ఎట్టకేలకు..దాదాపుగా ఆరు నెలల గ్యాప్ తర్వాత సినిమా ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్‌ 5.0లో భాగంగా..అక్టోబర్ పదిహేనో తేదీ నుంచి ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ప్రారంభించుకోవచ్చు. కోవిడ్ నిబంధనలు...

మద్యం అక్రమ రవాణాలో దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం రవాణాను రాజకీయ పార్టీల నేతలు సైడ్ బిజినెస్‌గా చేసుకున్నారు. గతంలో మచిలీపట్నం పార్లమెంట్‌కు పోటీ చేసిన బీజేపీ నేత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా ఈ సారి వైసీపీ నేత...

రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే చేతులు మిగలవు : సీపీఐ నారాయణ

కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో బలపడటానికి అగ్రెసివ్ మార్గాన్ని ఎంచుకుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల బిగింపు నిర్ణయంపై దూకుడుగా వెళ్లి రైతాంగంలో మద్దతు పెంచుకుని ఓటు బ్యాంక్‌ను ప్రభావవంతంగా...

ప‌వ‌న్ సినిమా… మిర‌ప‌కాయ్ – 2?

హ‌రీష్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టిన సినిమా `మిర‌ప‌కాయ్`. నిజానికి ఈ సినిమాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తీయాల‌నుకున్నాడు హ‌రీష్‌. కానీ కుద‌ర్లేదు. అది గుర్తుపెట్టుకునే హ‌రీష్ శంక‌ర్‌ని పిలిచి `గ‌బ్బ‌ర్ సింగ్‌`...

HOT NEWS

[X] Close
[X] Close