జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే…అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో కడప జిల్లా జైలుకు తరలించారు.అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించడంతో… అక్కడ నిరాశ ఎదురైంది. దాంతో వారు.. జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం వారు కడప జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు.

ఆ వ్యాపారంలో బీఎస్‌3 వాహనాలను బీఎస్‌4 వాహనాలుగా మార్చి.. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు పెట్టారు. అలాగే.. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారని అస్మిత్‌రెడ్డిపై కేసు పెట్టారు. వీరిని ఒకే రోజు అరెస్ట్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని..జేసీ సోదరులు తీవ్ర ఆరోపణుల చేశారు. కంపెనీ తమను మోసం చేసిందని … ఆ కంపెనీపై కేసులు పెట్టకుండా.. రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను ఏమీ అనకుండా… బాధితులం అయిన తమపైనే కేసు పెట్టారని వారు వాదిస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల కారణాలు చూపుతూ..జేసీ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.వాటిపై వారు న్యాయపోరాటం చేసినా.. ఏదో కేసు పెట్టి..సీజ్ చేయడంతో.. వారి వ్యాపారం మందగించింది. వారి వ్యాపారాలన్నింటినీ టార్గెట్ చేసినట్లుగా ప్రభుత్వం వ్యవహరించడంతో… తమ ఆర్థిక పునాదుల్ని దెబ్బకొడుతున్నారని.. వారు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తు్ననారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close