క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది. అదీ.. వింత‌. ఈ న‌ల్ల‌బ్బాయి, తెల్ల‌మ్మాయి.. మ‌ధ్య‌లో ఆ పులి క‌థేమిటో తెలియాలంటే `బ్లాక్ అండ్ వైట్‌` సినిమా చూడాలి. హాస్య న‌టుడు సుహాస్ క‌థానాయ‌కుడిగా మారిన సినిమా ఇది. సునీల్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. చాందినిచౌద‌రి క‌థానాయిక. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. టీజ‌ర్ విడుద‌లైంది.

ఓ ప‌ల్లెటూరు. అక్క‌డ ఓ బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్ లో ఉన్న ప్రేమ జంట‌. `ప్రేమ కంటే భ‌యం గొప్ప‌ది` అంటూ ఆ జంట‌కు భ‌యాన్ని ప‌రిచ‌యం చేసే ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. ఇదీ క‌థ‌. సుహాస్ ఇన్నోసెంట్ డైలాగులు‌, హ‌ర్ష పేల్చే సెటైర్లు, సునీల్ విల‌నిజం, కాల‌భైర‌వ ఇచ్చిన ఆహ్లాద‌క‌ర‌మైన నేప‌థ్య సంగీతం.. వెర‌శి.. ఈ సినిమా చూడ్డానికి కావ‌ల్సిన క్వాలిఫికేష‌న్లు అందించాయి. ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీకి కావ‌ల్సిన స‌రంజామా ఈ క‌థ‌కు ఉంద‌నిపిస్తోంది. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.