ఏపీ సీఎం చంద్రబాబు ఏదైనా నిర్మించాలని భావించారంటే.. అది పూర్తి చేసే వరకు అస్సలు వెనక్కి తగ్గరు. విమర్శలు చెలరేగినా..అడ్డంకులను దాటుకొని మరీ పూర్తి చేయడం ఆయన నైజం. అదే చంద్రబాబును గ్రేట్ విజనరీ లీడర్ గా ఎప్పటికప్పుడు ప్రశంసలు అందుకునేలా చేస్తోంది.
చంద్రబాబు ఎం చేసినా దూరదృష్టితో ఆలోచిస్తారు అనేది ఓపెన్ సీక్రెట్. ఉమ్మడి రాష్ట్రంలో శంషాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు ఆయన హయాంలోనే రూపకల్పన జరిగింది. హైదరాబాద్ వెలుపల ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్ట్ అవసరమా అంటూ చంద్రబాబుపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. అయినా , వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చి , నిధులు పట్టుబట్టి మరీ సాధించి ఏకాభిప్రాయంతో భూసేకరణ పూర్తి చేసి.. పనులు ప్రారంభించేలా చేశారు.
ఎయిర్ పోర్ట్ నిర్మాణం దశలోనే అప్పుడు ప్రభుత్వం మారినా.. తర్వాత ఏర్పాటు అయిన ప్రభుత్వం చంద్రబాబు ప్లాన్ మార్చకుండా అదే ప్లాన్ తో ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేసింది. అప్పటికీ, ఇప్పటికీ శంషాబాద్ లో విమానయాన ప్రయాణికుల సంఖ్య పెరగడంతోపాటు విమానాల ట్రాఫిక్ కూడా పెరిగింది. చంద్రబాబు దూరదృష్టితో ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టడం వలన..ఇప్పటికీ హైదరాబాద్ కు మరో ఎయిర్ పోర్ట్ అవసరం పడలేదు. అదీ చంద్రబాబు లోతైన ఆలోచనకు నిదర్శనంగా ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు.
రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీకి మొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు..ఏపీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టాలని భావించారు. భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణం కోసం 2016లోనే ప్లాన్ చేసి, కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చారు. భూసేకరణ పూర్తి చేసి 2019లో ఎయిర్ పోర్ట్ పనులు ప్రారంభించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో భోగాపురం ఎయిర్ పనుల్లో తాత్సారం జరిగింది. 2024లో కూటమి అధికారంలోకి రావడంతో తన కలల ప్రాజెక్టు భోగాపురం ఎయిర్పోర్టు పనులను స్పీడప్ చేయించారు చంద్రబాబు. ఏడాదిన్నర.. అతి త్జక్కువ టైంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేసి రికార్డ్ సృష్టించారు చంద్రబాబు.
మొత్తంగా చంద్రబాబు నేతృత్వంలో రెండు గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు ఏర్పాటు అయ్యాయి. బోగాపురం ఎయిర్ పోర్ట్ మరికొద్ది నెలల్లో అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో.. చంద్రబాబు విజన్ దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
