మోదీకి వ్యతిరేకం కాదని ఆర్నాబ్ చానల్ ద్వారా చంద్రబాబు సిగ్నల్స్ !

పొత్తుల గురించి కాకపోయినా… మోదీ విషయంలో తాను వ్యతిరేకంగా లేనని.. అవసరం పడితే తాను మోదీ వైపే ఉంటానని చంద్రబాబు సిగ్నల్స్ పంపారు. ఆర్నాబ్ గోస్వామి టీవీ చానల్ రిపబ్లిక్ టీవీ రెండు రోజుల పాటు ఓ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఆ స్మిట్‌లో చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొని మోదీ విధానాలను ప్రశసించారు. ప్రపంచంలో భారత్ ను నెంబర్ వన్ గా మర్చే సత్తా మోదీకి ఉందన్నారు. ఇప్పటికే ప్రపంచంలో భారత్ కు మోదీ ద్వారా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు.

ప్రధాని మోదీ అవలంభిస్తున్న ఆర్థిక విధానాలను .. అభివృద్ధి విధానాలను పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు. నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ విషయంలో తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ప్రత్యేకహోదా సెంటిమెంట్ వల్లనే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. టెక్నాలజీ రంగంలో భారత్ పురోగమిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ పొజిషన్‌లో ఉందని తెలిపారు. దేశంలో సాంకేతికతకు.. విజ్ఞానానికి ఎలాంటి లోటు లేదని స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణ మరింత పారదర్శకత తీసుకు వచ్చిందన్నారు. ఐదు వందల కన్నా ఎక్కువ డినామినేషన్ ఉన్న నోట్ల రద్దును తాను సమర్థిస్తానని తెలిపారు.

2014లో ఎన్డీఏలో కలిసి ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో భాగస్వాములయ్యారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏకు గుడ్ బై చెప్పి బయటకు వచ్చారు. దేశ వ్యాప్తంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు ప్రయత్నించారు. చురుకుగా దేశవ్యాప్తంగా పర్యటించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం అనుకూలంగా రాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో దూరం జరిగారు. జాతీయ రాజకీయాలను పట్టించుకోవడం మావేశారు. పూర్తిగా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నారు. పొత్తులతో సంబంధం లేకుండా మోదీ వైపే ఉంటానని సిగ్నల్స్ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close