మూడు నెలల తరువాత హైదరాబాద్ కి వస్తున్న బాబు

రాష్ట్ర విభజన జరిగిన తరువాత హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రా ప్రజలలో నెలకొన్న అభద్రతా భావం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచే సుమారు 13 నెలలు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ ఆ తరువాత జరిగిన ఓటుకి నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులలో అక్కడ తనకే భద్రతలేదని గ్రహించి విజయవాడకు మకాం మార్చేసారు. ఆ తరువాత ఆయన దేశావిదేశాలు అన్నీ తిరిగి వస్తున్నారు కానీ హైదరాబాద్ కి మాత్రం వెళ్ళడం లేదు. సుమారు మూడు నెలలు తరువాత మళ్ళీ నేడు ఆయన హైదరాబాద్ వెళుతున్నారు. కనుక ఇది కూడా ప్రత్యేకంగా పేర్కొనవలసిన వార్త అయింది. ఇకపై వారానికి రెండు రోజులు హైదరాబాద్ నుంచి పనిచేస్తానని చంద్రబాబు నాయుడు స్వయంగా తెలిపారు.

జనవరిలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.ఎం.సి.) ఎన్నికలు జరుగబోతునందున వాటి కోసం పార్టీని సిద్దం చేసేందుకు ఆయన మళ్ళీ హైదరాబాద్ కి వెళ్లి రావాలనుకొంటున్నారు. వచ్చే నెలలో జంట నగరాలలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కాబోతున్నారని కుతుబుల్లా పూర్ తెదేపా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికలలో తెదేపా-బీజేపీలు కలిసి పోటీ చేయబోతున్నాయి కనుక ఆయన బీజేపీ నేతలతో కూడా సమావేశమవుతారు. కేసీఆర్ తో కొత్తగా కుదిరిన దోస్తీ భంగం కలగకూడదనే ఉద్దేశ్యంతో ఆయన వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కానీ ఇప్పుడు జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో ఆయన స్వయంగా రెండు పార్టీలను నడిపించడానికి సిద్దపడుతున్నారు. మరి దాని వలన వారి దోస్తీ మళ్ళీ కటీఫ్ అయినట్లయితే పరిస్థితులు మళ్ళీ మొదటికి వస్తాయేమో? చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమం..!

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని .. చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనను ఐసీయూలోకి షిఫ్ట్ చేశామని .. లైఫ్ సపోర్ట్...

దుబ్బాకలో పోటీ చేసి తీరుతామంటున్న ఉత్తమ్..!

తెలంగాణలో ఆరు నెలల్లో ఉపఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందారు. అయితే..తెలంగాణలో నిన్నామొన్నటి వరకు ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే..వారి కుటుంబసభ్యులను...

అగ్నిప్రమాద ఘటనలో రాయపాటి కోడలికీ నోటీసులు..!

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన విషయంలో రమేష్ ఆస్పత్రిపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు పోలీసులు. ఇప్పటికే ఆస్పత్రి చైర్మన్ రమేష్‌కు.. విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో...

రాముడిపై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. అరెస్ట్..!

ఓ వైపు బెంగళూరులో ఓ చిన్న సోషల్ మీడియా పోస్టు సృష్టించిన విధ్వంసం కళ్ల ముందు కదలాడుతూండగానే.. హైదరాబాద్‌లోనూ అలాంటి అలజడి రేపడానికి కత్తి మహేష్ ప్రయత్నించారు. బెంగళూరు ఘటనల తర్వాత మంత్రి...

HOT NEWS

[X] Close
[X] Close