ఉచిత ఇసుక విధానమే చంద్రబాబు డిమాండ్..!

ఇసుక సరఫరా చేయడం చేతకాకపోతే… చేత కాని వాళ్లమని ప్రజల ముందు చెప్పుకోవాలని.. అంతే కానీ.. వరదలని.. మరొకటని చెప్పి.. పేదల ఉసురు తీయవద్దని చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక కొరతపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. పన్నెండు గంటల దీక్షను.. చంద్రబాబు ధర్నాచౌక్‌లో ప్రారంభించారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న కూలీల కుటుంబాలకు.. రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన కూలీలకు నెలవారీ పరిహారం పంపిణీ చేయాలన్నారు. ఉపాధి కోల్పోయి.. కుటుంబాన్ని పోషించలేక .. కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలన్నీ… ప్రభుత్వ హత్యలేననిృ్నారు.

అసలు ఇసుక సమస్య రావడానికి చాన్సే లేదని..కానీ కావాలని ఇసుక సమస్యను సృష్టించి.. ఇసుక మాఫియాను తయారు చేసి ప్రజలకు మీదకు వదిలారని మండిపడ్డారు. ఏపీ ఇసుక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో దొరుకుతుంటే ఇంటి దొంగలు ముఖ్యమంత్రికి కనపడరా? అని నిలదీశారు. సెల్ఫీ వీడియోలు తీసుకుని ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం కోసమే ఈ సమస్య సృష్టించారన్నారు. దాదాపు 35లక్షల మంది .. 125 వృత్తుల వారు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. ఆత్మహత్యలను మంత్రులు కించ పరచడాన్ని ఖండించారు.

ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారిపై.. వ్యక్తిగతంగా దాడి చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. పవన్ కల్యాణ్ అంశాన్ని ఆయన ఉదహరించారు. మీ కుటుంబసభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోగలరా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిని బెదిరించి.. కేసులు పెట్టి మాట్లాడకుండా చేద్దామనుకుంటున్నారని.. అలాంటి ఆటలు సాగబోవని హెచ్చరించారు. చంద్రబాబు దీక్షకు.. ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలు హాజరయ్యాయి. పలు ఇతర పార్టీల నేతల సంఘిభావం తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close