రోబోటిక్స్ కోసం ఇంగ్లిష్ చదువులొద్దా..? : జగన్

ఇంగ్లిష్ మీడియంను ఇంప్లిమెంట్ చేయడంపై.. విమర్శలు చేస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులపై జగన్మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇప్పటికే అంతటా ఇంటర్నెట్ కనిపిస్తోందని… వచ్చే పదేళ్లలో మరింత మారిపోతుందని.. విశ్లేషించారు. రాబోయే రోజుల్లో అంతా రోబోటిక్స్‌దే రాజ్యమని.. అలాంటి వాటిలో పేద పిల్లలు రాణించాలంటే.. ఇంగ్లిష్ చదువులు వద్దా.. అని ఆయన జగన్ ప్రశ్నించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఒక్క ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో కూడా.. తీర్మానించారు. అయితే.. ఇంగ్లిష్ పెట్టవచ్చు కానీ.. తెలుగు మీడియంను తీసేయడం ఎందుకని.. భాషా వేత్తలు, పండితులు, ఇతర రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. పైగా.. ఎంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ మీడియంలో చదువు చెప్పే సామర్ధ్యం ఉందని ప్రశ్నిస్తున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి.. వారంతా.. తాను పేదలకు ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తూంటే.. వారంతా అడ్డు పడుతున్నారన్నట్లుగా.. సందర్భం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల్ని మెరుగుపర్చేందుకు నాడు – నేడు అనే కార్యక్రమాన్ని జగన్ ఒంగోలులో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా… స్కూళ్లన్నింటికీ.. మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఈ కార్యక్రమం తొలిదశలో 15,715 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిల్లో 9 వసతులు కల్పించాలని నిర్ణయించారు. మరుగుదొడ్ల నిర్మాణం, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, స్వచ్చమైన తాగునీరు, పాఠశాలలకు రంగులు, శ్లాబులు, గోడల మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డుల ఏర్పాటు, అదనపు తరగతి గదులు, ప్రహారీల నిర్మాణం వంటి పనులు.. ఈ నాడు – నేడులో ఉననాయి. ఇప్పుడు.. స్కూళ్లు ఎలా ఉన్నాయో ఫోటోలు తీసి… నాడు – నేడు పూర్తయిన తర్వతా అప్పుడు మళ్లీ ఫోటోలు తీసి.. వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తారు.

అయితే.. విద్యాప్రమాణాల పెంపును.. కూడా.. ఈ కార్యక్రమంలో భాగం చేస్తే బాగుండేదేనే అభిప్రాయాలు.. విద్యారంగ నిపుణుల నుంచివచ్చాయి. పాఠశాలలకు.. మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమో… విద్యార్థులకు.. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందడం కూడా అంతే ముఖ్యమని.. గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ పాఠశాలల్లో సరిపడా సిబ్బంది లేరు. ఉన్న వారిలో సరిగ్గా విధులు నిర్వహించేవారే తక్కువ. కొన్ని వేల ఖాళీలు ఉన్నాయి. గత ప్రభుత్వం వేసిన డీఎస్సీని ప్రస్తుత ప్రభుత్వం ఇంత వరకూ క్లియర్ చేయలేదు. ముందు… విద్యార్థుల చదువును మెరుగుపరిచే నిర్ణయాలు కూడా తీసుకోవాలన్న అభిప్రాయం.. ఎక్కువగా వినిపిస్తోంది. కానీ.. ఫిజికల్‌గా కనిపించే మార్పే.. ఓటర్లలో ఎక్కువ ప్రభావం చూపిస్తుందని..జగన్ నమ్ముతున్నట్లున్నారని…అందుకే.. నాడు – నేడులో.. కేవలం మౌలిక సదుపాయాలను మాత్రమే పెట్టాలని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close