హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంకోసం భూసేకరణపై అసంతృప్తిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను ఒప్పించటానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే రంగంలోకి దిగుతున్నారు. పవన్‌ను ఒప్పించటంకోసం ముఖ్యమంత్రి ఆయనతో భేటీ ఆవుతారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇవాళ వెల్లడించారు. ఈ భేటీ హైదరాబాద్‌లోగానీ, విజయవాడలోగానీ రెండురోజులలో జరగొచ్చని చెప్పారు. ఏ పరిస్థితుల్లో భూసేకరణ చేయాల్సివస్తోందో సీఎమ్ పవన్‌కు వివరిస్తారని తెలిపారు. పవన్‌ను ఒప్పించిన తర్వాతే ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాలలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించటానికి పవన్ కళ్యాణ్ దోహదపడ్డారని, ఆయనను తాము గౌరవిస్తామని మంత్రి అన్నారు. రాజధాని నిర్మాణంకోసం విధిలేకే భూసేకరణ చేస్తున్నట్లు చెప్పారు. భూ సమీకరణకు ఎవరైనా రైతులు ముందుకొస్తే తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు భూసేకరణ జరిగే ప్రాంతాలలో పవన్ పర్యటించబోతున్నారని తెలిసింది. దీనికోసం, సర్దార్ షూటింగ్లో ఉన్న పవన్ – షూటింగ్‌ను రద్దుచేసుకుని ముంబాయినుంచి హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. రేపు మంగళగిరి, అమరావతి ప్రాంతాలలో పర్యటించనున్నట్లు తెలిసింది. పెనుమాకలోని ప్రభుత్వ కళాశాలలో రైతులతో సమావేశమైన తర్వాత చంద్రబాబుతో భేటీ అవుతారు.
అటు విజయవాడలో పార్టీనేతలతో సమావేశమైన చంద్రబాబు, కొందరు రైతుల సంక్షేమంకోసం వారి తరపున పవన్ మాట్లాడటంలో తప్పులేదని అన్నారు. పవన్‌కు వాస్తవ పరిస్థితులను తానే వివరిస్తానని చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై పాజిటివ్‌గా స్పందించాలని, ప్రతివిమర్శలకు దిగొద్దని పార్టీ నేతలకూ సూచించారు.