మెగా స్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. తెలుగు ప్రజలందరి తరపున తెలుగు 360.కాం ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఆయన జీవిత విశేషాల గురించి చెప్పడం అంటే అందరికీ తెలిసిన రామాయణ, మాహాభారత కధలను మళ్ళీ చెప్పినట్లే అవుతుంది. ఆయన జీవిత చరిత్రలో సినిమాలు, రాజకీయాలనే రెండు అధ్యాయాల గురించి తెలుగు ప్రజలందరికీ తెలుసు. సినీ రంగంలో ఆయన తన స్వయంకృషితోనే మెగాస్టార్ అయ్యారు. తెలుగు సినీ పరిశ్రమలో స్వర్గీయ ఎన్టీఆర్, ఏ.యన్.ఆర్. యస్వీఆర్ తరం నుండి నేటితరం యువనటులు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, జూ.ఎన్టీఆర్, మహేష్ బాబు తదితరుల వరకు కొనసాగుతున్న నటుడు చిరంజీవి. ఆయన రాజకీయాలలోకి వెళ్లి మళ్ళీ చాల ఏళ్ల తరువాత సినీ పరిశ్రమకి వస్తున్నారు. పైగా నేటితో ఆయనకి 60 ఏళ్ల వయసు నిండింది. అయినా ప్రజలు ఆయన చేయబోయే 150వ సినిమా కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారంటే, ఆయన సినిమాలకి ఇప్పటికీ ప్రజలలో ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతుంది. ఇటువంటి అపూర్వ ప్రజాధరణ, అభిమానం స్వర్గీయ ఎన్టీఆర్, ఏ.యన్.ఆర్, యస్వీఆర్ వంటి మహానటులకే చెల్లు. మళ్ళీ ఇప్పుడు చిరంజీవికి అటువంటి ఆదరణ లభిస్తోంది.

చిరంజీవి తన అభిమానుల కోరిక మేరకు ఈఒక్క సినిమాతోనే సరిపెట్టేస్తారా లేక మళ్ళీ వరుసపెట్టి సినిమాలు చేస్తారా? అనే విషయం ఆయనే చెప్పాలి. కానీ ఇంతవరకు ఆయన తన 150వ సినిమానే మొదలుపెట్టలేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ సినిమా చేసేందుకు ఆయన అంగీకరించినప్పటికీ, కధ రెండవ భాగం సంతృప్తికరంగా లేకపోవడంతో తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఒకవేళ చిరంజీవి ఇంకా సినిమాలు చేయదలిస్తే, పెరుగుతున్న తన వయసును దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా వేగంగా సినిమాలు చేయవలసి ఉంటుంది. అప్పుడే రెండవ ఇన్నింగ్స్ కూడా విజయవంతంగా ముగించవచ్చును.

ఇక రాజకీయాలలో మొదటి ఇన్నింగ్స్ లో తడబడినప్పటికీ ఆట ముగిసే సమయానికి కొంచెం నిలకడ సాధించినట్లే కనబడుతోంది. కానీ ఆయన నిలద్రొక్కుకొన్న సమయానికి ఆయన టీమ్(కాంగ్రెస్ పార్టీ) ఆలవుట్ అయిపోవడంతో ఆయన మళ్ళీ సినిమాలవైపు రావలసి వచ్చింది. కానీ నేటికీ రాజకీయాలలో కొనసాగాలనుకొంటూనే ఉన్నారు. ఆయన రాజకీయాలలో కూడా స్వయంకృషితోనే ఈ స్థాయికి ఎదిగినప్పటికీ, సినిమాలతో పోలిస్తే రాజకీయాలలో అంతగా రాణించలేకపోయారనే చెప్పవచ్చును. కానీ అందుకు ఆయనను తప్పు పట్టలేము. ఎందుకంటే ఆయన ఎంచుకొన్న కాంగ్రెస్ పార్టీ వేసిన తప్పులకి, తప్పటడుగులకి ఆయన మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

కానీ ఆయనంతటి వ్యక్తి సోనియా, రాహుల్ గాంధీల ముందు చేతులు కట్టుకొని నిలబడే బదులు, తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపి ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో? అని అభిమానులు కూడా అనుకొంటున్నారు. కానీ తామిద్దరం రాజకీయాలలో కలిసే అవకాశం లేదని వారి ఆశల మీద ఆయన నీళ్ళు చల్లారు. కానీ ఏదో ఒకరోజు ఇద్దరు కలిసి సినిమా చేయడం తధ్యమని చెప్పారు కనుక ఏదో ఒకరోజు మెగా బ్రదర్స్, మెగా హీరోలు అందరూ రాజకీయాలలో కలిసి పనిచేస్తారని వారి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రజలందరి అభిమానాన్నిస్వంతం చేసుకొన్న చిరంజీవికి మళ్ళీ మరోమారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సినిమాలలో రాజకీయాలలో కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా ఆడాలని కోరుకొందాము.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close