ఏపీని చంద్రబాబు మాత్రమే కాపాడగలరంటున్న వైసీపీ రెడ్డి నేత !

వైసీపీ నేతల్లో మార్పు వస్తోంది. మీరు రెడ్డే.. నే్ను రెడ్డే అనే ఈక్వెషన్‌తో పార్టీలో చేర్చుకున్న డీఎల్ రవీంద్రారెడ్డి రివర్స్ అయ్యారు. వైసీపీకి ఈ సారి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. గత ఎన్నికలకు ముందు తన ఇంటికి ప్రత్యేక దూతల్ని పంపించి మరీ పార్టీలో చేర్చుకున్నారని.. ఇప్పటికీ తాను వైసీపీలోనే ఉన్నానని ప్రకటించారు. వైసీపీ వాళ్లేమీ తనను తీసేయలేదని డీఎల్ రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని ఆయన మండిపడ్డారు. పరిపాలన మొదటిరోజు నుంచే అవినీతి మొదలుపెట్టారు.. ఆ పార్టీలో నేను ఉన్నానంటే నాకే అసహ్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనన్నార.ు గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేద్దామనుకుంటున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రస్తుత పరిస్థితుల్ల ోఎవరూ కాపాడలేరని.. ఒక్క చంద్రబాబు మాత్రమే కాపాడగలరన్నారు. పవన్ కల్యాణ్ నిజాయతీని ప్రశ్నించలేం కానీ ఆయనకు అనుభం లేదని డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం వారిద్దరూ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఏవర్గం ప్రజలు సంతృప్తికరంగా లేరని అన్నారు. దోచుకోవడమే తప్ప జగన్ కు ఈ నాలుగేళ్లలో రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు.

వైఎస్ వినేకానందరెడ్డి హత్య కేసులో జనవరి 3 నుంచి కీలక మలుపులు ఉంటాయని డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. వివేకా కేసులో ఎర్ర గంగిరెడ్డే కీలక వ్యక్తి అని సీబీఐ గుర్తించిందన్నారు. జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వాదనలు ఉన్నాయని.. సుప్రీం తీర్పు తర్వాత వివేకా కేసులో జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. చాలామంది మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉందన్నారు. వివేకా కేసులో ఒంటరిగా పోరాడుతున్న ఆయన కుమార్తె సునీత ధైర్యాన్ని మెచ్చుకోవచ్చని డీఎల్ వ్యాఖ్యానించారు పార్టీలో చేర్చుకుని కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో డీఎల్ రవీంద్ర పైర్ అవుతున్నారు. అయితే చంద్రబాబును పొడిగినా టీడీపీలో చేర్చుకునే పరిస్థితులు కనిపించడం లేదని ఆ పార్టీ నేతలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close