రివ్యూ: కనెక్ట్

హారర్ సినిమాలకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ‘మసూద’. హారర్ క‌థ‌ల్ని థియేటర్ లో చూసే జనం తగ్గిపోతున్న తరుణంలో మరోసారి హారర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి థియేట్రిక‌ల్‌ థ్రిల్ ఇచ్చింది. ఇప్పుడు నయనతార ప్రధాన పాత్రలో డబ్బింగ్ రూపంలో మరో హారర్ సినిమా ‘కనెక్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియంటెడ్ సినిమాల విష‌యంలో నయనతార సక్సెస్ రేటు ఎక్కువే. హారర్ కంటెంట్ ని అందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ కు మంచి పేరుంది. ఇంటర్వెల్ లేకుండా వెన్నులో వణుకు పుట్టిస్తామని చెప్పింది ‘కనెక్ట్’ టీం. మరి కనెక్ట్ లో వున్న కంటెంట్ ఏంటి ? ఎంతలా భయపెటింది ?

సుసాన్ (నయనతార) భర్త జోసెఫ్ బినోయ్(వినయ్ రాయ్) మంచి డాక్టర్. కూతురు అన్నా(హానియా నఫీస్). స్కూల్లో చదువుకుంటూనే మ్యూజిక్ కూడా నేర్చుకుంటూ ఉంటుంది. లండన్ లో హార్వర్డ్ మ్యూజిక్ స్కూల్ లో సీటు తెచ్చుకుంటుంది. ఇంతలో దేశంలో కోవిడ్ వ్యాపిస్తుంది. లాక్ డౌన్ విధిస్తారు. జోసెఫ్ కోవిడ్ డ్యూటీలో హాస్పిటల్ లోనే వుండిపోతాడు. అక్కడ పేషెంట్లకి చికిత్స అందిస్తూ కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతాడు. తండ్రి మరణంతో అన్నా చాలా తీవ్రంగా కలత చెందుతుంది. తన కోసం స్వరపరిచిన పాట పాడమని హాస్పిటల్ బెడ్ పై ఉంటూ వీడియో కాల్ కోరుతాడు జోసెఫ్. కానీ అన్నా బాధలో పాడలేకపోతుంది. తండ్రి చివరి కోరిక తీర్చలేకపోయాననే బాధ అన్నాని మరింతగా వెంటాడుతుంది ఇదీలా ఉండగానే సుసాన్, అన్నా ఇద్దరూ కోవిడ్ బారిన పడి హోం ఐసోలేషన్ లో చెరో గదిలో వుంటారు. చనిపోయిన తన తండ్రి ఆత్మతో మాట్లాడాలని ఆన్ లైన్ లో విజ బోర్డ్ ( ouija board) టెక్నిక్ ఆశ్రయిస్తుంది. దీని తర్వాత అన్నాలో అన్యుహ్యమైన మార్పులు వస్తాయి. అన్నాలోకి ఒక దుష్ట ఆత్మ ప్రవేశిస్తుంది. సుసాన్ తండ్రి ఆర్థర్ (సత్యరాజ్) తో కలసి ఆ ఆత్మ పీడ ఎలా తొలగించారనేది మిగతా కథ.

కరోనా లాక్ డౌన్ లో చాలా కథలు జరిగాయి. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఆ సమయంలో ఒక క్రిస్టియన్ కుటుంబంలో జరిగిన హారర్ కథని కనెక్ట్ లో చూపించాడు. ఒక వ్యక్తికి దుష్ట ఆత్మ ఆవహించడం, వింతగా ప్రవర్తించి భయపెట్టడం, చివరికి ఆ ఆత్మని శరీరం నుంచి దూరం చేయడం..ప్రతి హారర్ సినిమా టెంప్లెట్ ఇదే. కనెక్ట్ కూడా ఈ పంథాలోనే వుంటుంది. అయితే దర్శకుడు ఎంచుకున్న సెటప్ మాత్రం కొత్త అనుభూతిని ఇస్తుంది. లాక్ డౌన్ లో జరిగిన కథ ఇది. అప్పుడు ప్రయాణాలు ఆగిపోయాయి. ఎవరి ఇంట్లో వాళ్ళు వుండిపోయారు. మాట్లాడాలంటే వాయిస్ కాల్, చూడాలంటే వీడియో కాల్.. లాక్ డౌన్ లో ఇలానే ప్రపంచం నడిచింది. ఈ సినిమా మొత్తాన్ని వీడియో కాల్ తో ‘కనెక్ట్’ చేశాడు దర్శకుడు. సాంకేతిక పరంగా ఈ టెక్నిక్ ని మెచ్చుకోవాల్సిందే.

సుసాన్, అన్నా.. ఒకే ఇంట్లో చెరో గదిలో వుంటారు. అర్ధర్ వేరే వూర్లో ఉంటాడు. ఒక వీడియో కాల్ లోనే కథ నడుస్తుంది. అన్నా తండ్రి ఆత్మతో మాట్లాడానికి ఆశ్రయించే టెక్నిక్ ఇది వరకే కొన్ని సినిమాల్లో చూశాం. కానీ కనెక్ట్ లో దాన్ని మరింత ప్రభావంతంగా చూపించారు. ఈ కథలో భయానికి భీజం చేసిన సన్నివేశం అది. తర్వాత అన్నా వింతగా ప్రవర్తించే సీన్స్, వీడియో కాల్స్ లో వింత ఆకారాలు, శభ్ధాలు వినిపించడం.. ఇవ‌న్నీ ప్రేక్షకుడిని భయపెడతాయి. బేసిగ్గా హారర్ సినిమాల్లో భయపెట్టడానికి పాడుబడ్డ ఇల్లు, బంగ్లాలని ఆశ్రయిస్తారు. కనెక్ట్ లో మాత్రం ఒక చిన్న పడక గదిని చాలా భయానకంగా చూపించడంలో దర్శకుడు తెలివిని మెచ్చుకోవాలి. అన్నా రూమ్ కి వీడియో కాల్ వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఎలాంటి రూపం ప్రత్యేక్షమైపొతుందో అనే భయం ప్రేక్షకుడిలో వుంటుంది. అన్నాకి దెయ్యం పట్టిందా లేదా అని తెలుసుకోవడానికి వాటి పవిత్ర జలం, చర్చ్‌ ఫాదర్ ప్రార్ధన సీక్వెన్స్ లు హారర్ మూడ్ ని బాగానే ఎలివేట్ చేశాయి. అన్నాకి థెరపి ఇవ్వడానికి వీడియో కాల్ లో వచ్చిన డాక్టర్ కి సంబధించిన రహస్యాలు.. అన్నా మలయాళం భాషలో చెప్పే ఎపిసోడ్ కూడా ఇంట్రస్టింగా వుంటుంది. రూమ్ లో రివర్స్ క్రాస్ లు, అన్నా స్పైడర్ లా సీలింగ్ కి అత్తుక్కునే సీన్, తలుపు చప్పుడ్లు, వెనక్కి తిరిగి చూడాలంటే భయపడే కెమరా మూమెంట్స్ ఇందులో చాలా వున్నాయి.

అయితే హారర్ సినిమాల్లో ఆత్మలకు కూడా కొన్ని లక్ష్యాలు వుంటాయి. ఇందులో అలాంటిది కనిపించదు. సైతాన్, దేవుడు ఇష్టపడే వస్తువలని నాశనం చేయడానికి ఉంటాడనే డైలాగ్ తో ఏదో జస్టిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నించారు. అన్నాని ఆవహించిన ఆత్మ కర్సన్ అనే మనిషిదని తెలుస్తుంది. దానికి గురించి కూడా ఎలాంటి వివరణ లేదు. బహుశా నిడివి తక్కువ కావడం, కోవిడ్ టైం కి దాటి మరో ఎపిసోడ్ నడపాలని భావించకపోవడం దీనికి కారణం కావచ్చు. అలాగే ఆత్మని తొలగించడాని క్రిస్టియానిటీలో చేసే భూతవైద్యం కూడా రొటీన్ గానే వుంటుంది. అది ఆన్ లైన్ లో జరగడం వెరైటీ అనుకోవాలి. అలాగే హారర్ తెప్పించే ప్రయత్నంలో ఫిజిక్స్ కి అందని కొన్ని సీన్లు కూడా ఇందులో కనిపిస్తాయి.

ఏ పాత్రకైనా సరిపోయే నటి నయనతార. ఇందులో సుసాన్ పాత్రని కూడా చాలా సహజంగా చేసింది. ఆమె భయపడే విధానం చాలా సెటిల్డ్ గా వుంటుంది. అన్నా చేసిన హానియా నఫీస్ నటన బావుంది. ఆమె లుక్స్ లోనే హారర్ వుంది. వినయ్ రాయ్ ది చిన్న పాత్రే. సుసాన్ తండ్రి పాత్రలో సత్యరాజ్ నటన ఆకట్టుకుంటుంది. ఫాదర్ అగస్టయిన్ పాత్రలో అనుపమ్ ఖేర్ ప్రజన్స్ ‘కనెక్ట్’ చేస్తుంది. మిగతా పాత్రలన్నీ వీడియో కాల్స్ లోనే కనిపిస్తాయి. టెక్నికల్ గా సినిమా బావుంది. వీడియో కాల్ అయినప్పటికీ అందులోనే చాలా మంచి లైటింగ్ తో హారర్ మూడ్ ని ఎలివేట్ చేశారు. బేసిగ్గా హారర్ సినిమాల్లో టైట్ క్లోజులు పెట్టి ఎక్కువగా భయపెడతారు. కానీ ఇది వీడియో కాల్ కావడం వలన దర్శకుడు ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు. వీడియో కాల్ ఫ్రేమ్ నే ఉంచాడు. జూమ్ లు, క్లోజులు జోలికి వెళ్ళకుండా ఎంచుకున్న నేపధ్యాన్ని నిజాయితీగా తీశాడు. నేపధ్య సంగీతానికి ఫుల్ మార్కులు పడతాయి. కొన్ని చోట్ల ఉలికిపాటుకి గురి చేస్తుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కనెక్ట్ ని ప్లస్ పాయింట్స్.

కనెక్ట్ కొత్త హారర్ కథ కాదు. కోవిడ్ నేపధ్యంలో సెట్ చేయడంతో కొత్త కలరింగ్ వచ్చింది. ముగింపు కూడా సాధారణంగానే వుంటుంది. ఈ సినిమాకి ఇంటర్వెల్ లేదనే సమాచారంతో చూస్తే ఓకే కానీ లేదంటే ‘ఇంతేనా’ అనే ఫీలింగ్ ప్రేక్షకుడిలో కలుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close