మెట్రో రైల్‌లో ప్రయాణించిన చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెట్రో రైల్ పనితీరును స్వయంగా తెలుసుకున్నారు. నిన్న ఢిల్లీలో మెట్రోరైల్‌లో ప్రయాణించారు. నిన్న సిస్కో కంపెనీ ప్రతినిధులతో సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి, ఆ భేటీ ముగిసిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళటానికి మెట్రో ఎక్కారు. కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి మెట్రో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సిస్కో ఛైర్మన్‌తో జరిపిన భేటీలో విశాఖపట్నంలో సిస్కో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. దీనికి సిస్కో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ భేటీ తర్వాత ముఖ్యమంత్రి కొందరు పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశమయ్యారు. అక్కడనుంచి ముంబాయి వెళ్ళి మేకిన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com