రోజురోజుకూ పెద్దదవుతున్న తలారి సత్యం మర్డర్ కేసు

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గత నెల 9న సినిమా ఫక్కీలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను టిప్పర్ వచ్చి గుద్దేసింది. ఇద్దరు యువకులూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ కేసులో స్థానిక ఎమ్మెల్యే, అధికారపార్టీకి చెందిన జీవన్ రెడ్డి ప్రధాన నిందితుడు. ఆ యాక్సిడెంట్‌లో చనిపోయిన ఇద్దరిలో ఒకరైన తలారి సత్యం కొంతకాలంగా జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు. జీవన్ రెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేసినపుడు దాఖలు చేసిన అఫిడవిట్‌లో అతనిపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పొందుపరచలేదని, అతని ఎన్నిక చెల్లదని తలారి సత్యం హైకోర్టులో కేసు వేశారు. ఆ ఎన్నికల్లో తలారి సత్యం రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేశారు. మరోవైపు తలారి సత్యం బైకును గుద్దిన టిప్పర్ జీవన్ రెడ్డి సోదరుడిదే కావటం విశేషం. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన కొడుకును ఎన్నోరోజులుగా బెదిరిస్తూ వచ్చాడని, తన కొడుకు కొన్నాళ్ళు అజ్ఞాతంలో కూడా ఉండాల్సి వచ్చిందని సత్యం తండ్రి ఆరోపణ. తనకు ప్రాణహాని ఉందంటూ సత్యం మానవ హక్కుల సంఘాన్నికూడా ఆశ్రయించాడని తెలిపారు. తలారి సత్యం మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట గత కొన్నిరోజులుగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. నిన్న టీడీపీ శాసనసభాపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఈ రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో ఇదివరకటి తరహాలో నక్సలైట్ల కార్యకలాపాలు ఉంటేనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు కొంతవరకైనా అడ్డుకట్ట పడేదేమోనని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేరును ఇంతవరకు ఎఫ్ఐఆర్‌లో చేర్చకపోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, మధు యాష్కి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు కూడా రేపు నిజామాబాద్ వచ్చి ఈ రిలే నిరాహారదీక్షలలో పాల్గొననున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ వివాదం బాగా ముదిరేటట్లే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close