వల్లభనేని వంశీ వైసీపీలోకి జంప్ చేయబోతున్నారా?

హైదరాబాద్: నిన్న, ఇవాళ విజయవాడలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ అనుమానం రాకమానదు. తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడలో ఇన్నర్ రింగ్‌రోడ్‌కోసం అధికారులు చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా రోడ్డెక్కటం, ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయటం, దానికి నిరసనగా వంశీ తన గన్‌మ్యాన్‌లను సరెండర్ చేయటం తెలిసిందే. రాష్ట్ర హోమ్ మంత్రి చినరాజప్ప వంశీ కేసుపై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకు వెళుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని, తప్పు చేసినట్లు విచారణలో తేలితే శిక్ష తప్పదని కూడా అన్నారు. సాధారణంగా ప్రభుత్వంలోని పెద్దలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే దానికి అర్థం పోలీసులు చర్యలు తీసుకోవటం ఖాయమని అందరకూ తెలిసిందే. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ఇళ్ళ తొలగింపు వివాదంపై శరవేగంగా స్పందించటం విశేషం. మామూలుగా రాష్ట్రస్థాయి పెద్ద వివాదాలకే జగన్ బాగా ముదిరిన తర్వాతగానీ వెళ్ళరు. మరి నిన్నటి స్థానిక వివాదానికి జగన్ స్పందించిన తీరు చూస్తే వంశీ ఆందోళనకు మద్దతుగా నిలబడటానికే అన్నట్లుగా కనబడుతోంది. వంశీ గతంలో జగన్ పార్టీలోకి జంప్ చేయాలని ఉవ్విళ్ళూరిన సంగతి తెలిసిందే. జగన్ ఒక సందర్భంలో విజయవాడ వచ్చినప్పుడు ఆయనను కలవటానికి బెంజ్ సర్కిల్ దగ్గర చాలా సేపు వేచి చూసి మరీ వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. ఈ పరిణామంలో ఇంకో అవకాశంకూడా ఉంది. వంశీ వైసీపీలోకి వెళ్ళిపోతాడని తెలిసే ప్రభుత్వం అతనిపై కేసులు పెట్టి ఉండొచ్చు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇవాళ మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోతానని చెప్పిన వంశీ అలా చేయలేదు. కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా వంశీ ఇలా అధికారపార్టీలోనే విపక్ష సభ్యుడిలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారిన హోటల్ దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని బాజిది కావటం విశేషం. బాజి ప్రస్తుతం తెలుగుదేశంలోనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close